తెలంగాణలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు పై ప్రశంసలు దక్కుతున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరిగిన చిన్నారి అత్యాచారం హత్య కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు వేగంగా స్పందించ లేకపోయారు అనే కామెంట్లు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో పోలీసులు విఫలం కావడంతో 10 లక్షల రివార్డు ప్రకటించారని ఒక సాధారణ నేరస్తుడిని పట్టుకోలేక ముప్పతిప్పలు పడ్డారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.

దిశ ఘటన సమయంలో కూడా తెలంగాణ పోలీసుల తీరుపై ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని పట్టుకున్న తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్న వ్యవహారశైలిపై ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా పట్టుకునే ముందు మాత్రం సమస్యలు తెలుసుకుంటున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. తాజాగా జరిగిన ఘటనలో పోలీసులు పది లక్షల రివార్డు ప్రకటించడాన్ని విపక్షాలు చాలావరకు తప్పుబట్టాయి. అలాగే కలెక్టర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పడం పట్ల కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి. బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి.

పోలీసులు వేగంగా స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనేది విపక్షాలు చెబుతున్న మాట. నిందితుడు రాజు విషయంలో చివరి నిమిషంలో పోలీసులపై 70 బృందాలుగా విడిపోయి దాదాపు వెయ్యి మంది పోలీసులు వెతకడం అతను దొరక్కపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకోవడం పోలీసులు చేతగానితనమే ఆరోపణ కూడా ఉంది. డీజీపీ మహేందర్రెడ్డి ని కూడా లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి కొన్ని కొన్ని ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సమాజంలో చైతన్యం వచ్చేవరకు ఘటనను పొడిగించుకునే వెంటనే చర్యలు తీసుకుంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా  అని విషయంలో మాత్రం పోలీసుల ఒత్తిడే అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అనే కామెంట్లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts