త్వరలో ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకత్వాన్ని మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. బిజెపి రాష్ట్ర నాయకత్వం విషయంలో కేంద్ర నాయకత్వం చాలా వరకు అసహనం గా ఉందని కొంతమంది కీలక నాయకులు సమర్థవంతంగా పని చేయకపోవడం పట్ల బిజెపి కేంద్ర నాయకత్వం లోని నాయకులు సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. జాతీయ నాయకత్వం లో కొంతమంది నాయకులు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని నివేదికలు పరిశీలించగా బిజెపి వెనకడుగు వేస్తుందని చాలా వరకు కార్యకర్తలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని గుర్తించారు.

జనసేన పార్టీని సమర్థవంతంగా వాడుకోలేక పోవడం అలాగే పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ముందుకు తీసుకు రాలేకపోవడం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసే విషయంలో సబ్జెక్టు లేకపోవడం వంటి అంశాలు చాలా వరకు విమర్శలకు దారి తీస్తున్నాయి అని అంటున్నారు. కేంద్ర నాయకత్వానికి అసలు ఎటువంటి నివేదికలు కూడా అడిగితే మినహా పంపించడం లేదని దీంతో పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. దీంతో రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్ర నాయకత్వం సిద్ధమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం పార్టీలో మళ్లీ చురుకుగా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ బిజెపి లో ఆదినారాయణ రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ మినహా పెద్దగా ఎవరూ ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు కాదు. అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాస్త పార్టీ కర్నూలు జిల్లాలో అండగా నిలబడింది. వాళ్లు మినహా పార్టీ కోసం ముందుకు వచ్చి పని చేయడానికి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు కూడా పెద్దగా ప్రయత్నం చేయటం లేదు. పార్టీకి ఉన్న రాజ్యసభ ఎన్నికలు అందరూ ఢిల్లీలోని ఎక్కువగా ఉండటం పార్టీకి సమస్యగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp