జాతీయ స్థాయిలో వెల్ల‌డయిన గణాంకాల‌ను గంగ‌లో క‌లిపేయండి స‌ర్ ఏం కాదు కానీ వాస్త‌వాల‌పై కాస్త‌యినా మాట్లాడండి. కేసులు త‌గ్గితే వేధింపులు త‌గ్గితే చాలా సంతోషం. అవెందుకు త‌గ్గ‌డం లేదు అన్న‌దే సిస‌లు ప్ర‌శ్న‌. దిశ యాప్ అన్న‌ది జ‌స్ట్ యాప్ అదొక యాక్ట్ కాదు అన్న తెలివి మాలో ఉంది క‌నుక ప్లీజ్ ఇప్పటికైనా మ‌గువ‌ల ర‌క్ష‌ణ‌పై చ‌ర్య‌లు తీసుకోండి డీజీపీ స‌ర్....


మ‌హిళ‌ల‌ను వేధించకండి..వారిని గౌర‌వంగా చూడండి. అని త‌రుచూ చెప్పే ప్ర‌భుత్వాలు ఆ విష‌య‌మై తీసుకుంటున్న చ‌ర్య‌లు అంతంత మాత్ర‌మే అని తేలిపోయింది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను వేధించే కేసుల‌కు సంబంధించి మ‌హారాష్ట్ర, తెలంగాణ త‌రువాత ఏపీ త‌రువాత స్థానంలో ఉంది.అయిన‌ప్ప‌టికీ వీటిపై ఎటువంటి చ‌ర్య‌లూ లేవు. ముఖ్యంగా మ‌గువ‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించి ప్ర‌తిరో జూ ఏదో ఒక చోట కేసులు న‌మోదు అవుతున్నా, బాధితుల గోడు వినిపించుకునే వారే లేరు. సైబ‌ర్ క్రైం పై కూడా ఇదే విధంగా పో లీసుల తీరు ఉంది. అన్నింటినీ కాపాడే ఆత్మ‌బంధువు దిశ‌యాప్ అని చెబుతున్నా ఆ యాప్ ద్వారా న‌మోద‌యిన చిన్నా చిత‌కా కేసులు మిన‌హా భారీ ఎత్తున సాగే వేధింపుల‌కు ప‌రిష్కార‌మే లేదు. ముఖ్యంగా ప్ర‌భుత్వ  కార్యాల‌యాల‌లో ప‌నిచేసే మ‌హిళ‌ల‌కు ఉన్న‌తాధికారుల వేధింపులు ఉన్నా అవి వెలుగులోకి రావ‌డం లేదు. ముఖ్యంగా లైంగిక వేధింపుల‌పై పోలీసుల నుంచి ఎటువం టి చ‌ర్య‌లు న‌మోదు కావ‌డం లేద‌న్నది ఓ స‌మాచారం. లైంగిక వేధింపుల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది.


 
ఇంకా చెప్పాలంటే...
ఆంధ్రావ‌నిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త కొర‌వ‌డుతుందున్న విష‌య‌మై అనేక విమ‌ర్శ‌లు వ స్తున్నాయి. జాతీయ నేర గ‌ణాక సంస్థ అందించిన‌ నివేదిక గ‌డిచిన రెండేళ్ల‌నూ విశ్లేషించింది. దీని ప్ర‌కారం ఆంధ్రాలో భ‌యాందోళ న లు రేకెత్తించేలా మ‌గువ‌ల‌పై దాడులు జరుగుతున్నాయి. ఆత్మ గౌర‌వానికి భంగం వాటిల్లే ప‌నుల్లో ఏపీ నే నంబ‌ర్ ఒన్ అని తేలి పో యింది. కానీ పోలీసు వెర్ష‌న్ మాత్రం మ‌రో విధంగా ఉంది. ఏపీలో నేరాల శాతం త‌గ్గింద‌ని పోలీసు శాఖ చెబుతోంది. మ‌రోవైపు మ హిళ‌ల‌ను ర‌హ‌స్యంగా చిత్రించి వేధించిన ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి కూడా ఏపీలోనే ఎక్కువ చోటుచేసుకున్నాయ‌ని తెలుస్తోంది. అ దేవిధంగా అత్యాచార కేసుల‌కు సంబంధించి 1095 ఘ ట‌న‌ల‌లో 1088 కేసులకు సంబంధించి తెలిసిన వారే నేర‌స్తులు అని తేలిం ది. అదే విధంగా సైబ‌ర్ క్రైం కూడా బాగా పెరుగుతోంది. నే రాలు పెరిగిపోవ‌డంతో వీటిని ఎలా నియంత్రించాలో తెలియ‌క పోలీసులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap