ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ముగిసింది. కాసేపటి క్రితం మీడియా ముందు మంత్రి పెర్ని నానీ కేబినేట్ సమావేశానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచనలు చేసారు. పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సిఎం ఆదేశించారని మంత్రి వివరించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని జగన్ ఆదేశించారు.

ధనికులను కూడా పెన్షన్ లబ్దిదారుల జాబితాలో చేర్చిన గత టీడీపీ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసిందని కేబినేట్ లో పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. విద్యుత్ భారం కూడా గత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడ్డ మంత్రులకు... జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న లబ్దిని.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ల విషయం లో హైకోర్టు తీర్పు పై మంత్రి పేర్ని మాట్లాడుతూ... మార్చ్ 6, 2020 న ఇచ్చిన నోటిఫికేషన్ కు నేడు లెక్కేట్ట మంటే ఏమి ఉపయోగం, ఏమి ఆనందం ఉంటుంది అని ప్రశ్నించారు.

నామినేషన్ వేసిన వాళ్లకు కూడా సంతోషం లేదు అన్నారు ఆయన. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కి సమవుజ్జి కాదు అన్నారు. కావాలని ఆయాన అనేక వ్యాజ్యాలు వేయించి ప్రభుత్వం కు మోకాలు అడ్డుకున్నారు అని వ్యాఖ్యానించారు. 2019 కి ఇప్పటికి రాష్ట్రం లో 17 శాతం క్రైమ్ తగ్గింది అన్నారు ఆయన. నాడు   నేడు  పనులకు  సంబంధించి   ఆసుపత్రుల్లో  అభివృద్ధి కి  ప్రభుత్వం  దృష్టి  పెట్టింది  అని తెలిపారు. నాడు  నేడు  పనుల్లో   భాగంగా  విరాళాలు  ఇచ్చే   దాతల  పేర్లు  స్కూళ్లు.. ఆస్పత్రులకు  పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నకిలి  మందులు   అమ్మే  వారిపై  కఠిన  చర్యలు  తీసుకోవాలని  కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp