రైలు ప‌ట్టాల‌పై శవం ఉంది క‌నుక ఇది ఎన్కౌంట‌ర్ కాదు అని రైలు కౌంట‌ర్ అని తెలంగాణ పోలీసులు కొత్త భాష్యం ఒక‌టి చెప్పార‌ని ఈ వివాదంలో మ‌రో అంశం లేవ‌నెత్తుతున్నారు పౌర హ‌క్కుల నేత‌లు. ప్రాణాలు తీసేంత స్థాయి పోలీసుల‌కు లేద‌ని, చ‌ట్టాన్ని చే తుల్లోకి తీసుకుని ప్ర‌వ‌ర్తించ‌డం అన్న‌ది త‌గ‌ద‌ని నిందితుడి త‌రఫు బంధువులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. మ‌రోవైపు సెల బ్రిటీలు రాజు ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి దేవుడు వేసిన శిక్ష ఇది అని, చిన్నారి ఆత్మ శాంతిస్తుంద‌ని అంటున్నారు.


ఎవ‌రిదీ హ‌త్య..అన్న ప్ర‌శ్న నుంచి ఆలోచిస్తే చిన్నారి చైత్ర చావుకు సంబంధించి ఎన్నో నిజాలు వెలుగుచూస్తాయి. అదేవిధంగా నిందితుడికి సంబంధించి కూడా కొన్ని వివ‌రాలు అందుతాయి. ఆయ‌న మంచి వాడా చెడ్డ‌వాడా ? నేర చ‌రిత్ర ఉన్నావాడా కాదా? ఇవ‌న్నీ తేలాలి. ఈయ‌న‌ను పాత నేర‌స్తుడు అని చెబుతున్నారు..అయితే ఏయే కేసులలో ఇరుక్కున్నాడు.. వాటికి సంబంధించి పోలీసుల‌కు అందిన స‌మాచారం ఏంటి? అన్న‌వి కూడా తేలాలి. మ‌రోవైపు ఈ కేసులో పోలీసులే అస‌లు నిందితులు అని రాజును వారే చంపేశార‌ని హంత‌కుడి త‌ర‌ఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది నిజ‌మేనా కాదా? రైలు ప‌ట్టాల‌పై శ‌రీరం అస్స‌లు ముక్క‌లు కాకుండా అలా ఎలా ల‌భ్యం అవుతుంది ? హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రించడం వెనుక ఉన్న‌తాధికారుల ఆదేశాలు ఉన్నాయి అని వారు ప‌లు సంద‌ర్భాల్లో మీడియా ఎదుట ఆరోపిస్తున్నారు.


 

చిన్నారి చైత్ర ఉదంతంపై పౌర స‌మాజం ఆగ్ర‌హం వెల్లువెత్తిన త‌రుణాన రాజు కుటుంబం స్పందన ఏంట‌న్న‌ది కూడా మీడియా తె లుసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆయ‌న భార్య మౌనిక మీడియా ఎదుట స్పందించింది. ఆమె చెప్పిన ప్ర‌కారం త‌న భ‌ర్త మంచి వా డ‌ని, అలాంటి ప‌నులు చేయ‌డ‌ని చెబుతోంది. త‌న భ‌ర్త‌తో పాటే తాను చ‌నిపోతాన‌ని చెబుతోంది. పోలీసులే ఈ హ‌త్య చేశార‌ని అను మానం వ్య‌క్తం చేస్తోంది. ఒక‌వేళ త‌న భ‌ర్త త‌ప్పు చేస్తే చ‌ట్ట ప్ర‌కారం శిక్షించాలే కానీ ఇలా చంప‌డేమేంట‌ని ప్ర‌శ్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg