ఇటీవలే హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఘటనపై అటు రాష్ట్ర ప్రజానీకం మొత్తం తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది  నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం అటు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య ఘటనపై రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న సమయంలో  రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు .


 కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాలేదు కేసీఆర్. దీంతో అటు కె.సి.ఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రజలు ఎటు పోయినా పర్వాలేదు కేసీఆర్కు మాత్రం ఓట్లు కావాలి అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలు పెట్టాయి.  ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినా కూడా కెసిఆర్ ప్రభుత్వం నిందితుడిని పట్టుకోలేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయ్ ప్రతిపక్ష పార్టీలు  ఇక ఇటీవల బీజేపీ నేత విజయశాంతి కూడా కెసిఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.



 ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన గురించి మాట్లాడటానికి కూడా మనసు రావడం లేదు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించకపోవటం సిగ్గుచేటన్నారు విజయశాంతి. తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించలేని కెసిఆర్ వెంటనే పదవినుంచి దిగిపోవాలని కెసిఆర్ ఆ పదవికి అర్హుడు కాదు అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.  కెసిఆర్కు ఓట్లు సీట్లు తప్ప ప్రజల గురించి అసలు అవసరం లేదు అంటూ విమర్శించారు. అయితే మహిళలకు రక్షణ కల్పించడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాలి దీనికోసం ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానని విజయశాంతి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: