చ‌ట్టం ఓడిపోయింద‌ని చెప్పండి.. హ‌క్కులు పారిపోయాయి అని చెప్పండి.. రాజు హ‌త్య‌కు సంబంధించి ఇలానే రాయండి అని పౌర హ‌క్కుల సంఘాలు, ప్ర‌గ‌తి శీల మ‌హిళా సంఘాలు మండిప‌డుతున్నాయి. చిన్నారి చైత్ర హ‌త్యోదంతంలో ప్ర‌ధాన నిందితుడ్ని ఘ ట్ కేసర్ స‌మీపాన రైలు ప‌ట్టాల‌పై చూపించ‌డం అంతా నాట‌క‌మే అని ఆరోపిస్తూ, రాజు (నిందితుడు) కుటుంబ స‌భ్యుల వాద‌న‌లో ఉన్న నిజానిజాల‌ను నిగ్గు తేల్చాల‌ని, దీనిపై కోర్టుకు పోవాల‌ని యోచిస్తున్నాయి అని స‌మాచారం.



చైత్ర కేసులో నిందితుడి మ‌ర‌ణం వెనుక
పోలీసులు ఉన్నారు వారే గెలిచారు........
లేదా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం గెలిచింది అని రాయండి

- ఇదీ పౌర హ‌క్కుల నుంచి వినిపిస్తున్న మాట



శ్రీ‌కాంత్ రెడ్డి అనే  ధ‌ర్మ‌పురి టీఆర్ఎస్ నేత రాజు ను రానున్న రోజుల్లో ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేల‌డం చూస్తార‌ని ఎఫ్బీలో చెప్పారు. మ రి! ఈ నేత‌కు ఈ సంగ‌తి ఎలా తెలుసు అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. ఆయ‌న అక్క‌డ డీసీఎంఎస్ చైర్మ‌న్ అని తెలుస్తోం ది. ఈయ‌న‌కు ఎవ‌రు చెప్పారు. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం చేయించిన హ‌త్య ఇది అని పౌర హ‌క్కులు గ‌గ్గోలు పెడుతుంటే, పౌర స మాజం మాత్రం ఏం జ‌రిగినా అదంతా మ‌న మంచికే అన్న ధోర‌ణిలో పోలీసు చ‌ర్య ఒక‌వేళ హ‌త్యే అయినా అందుకు కూడా సమ్మ తించేలానే ఉంది.



చ‌ట్టం ముంద‌ర అంద‌రూ స‌మానులే అని చెప్ప‌డంలోనే మ‌న రాజ్యం, రాజ్యాంగం ఓ ఉన్న‌త స్థాయిని ఎన్న‌డో పొందాయి. రాజ్యం లో గ‌న్ను మాట్లాడిన ప్ర‌తిసారీ చ‌ట్టం మౌనం వ‌హించిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. మౌనం వ‌హించిన చ‌ట్టాలు అన్నీ రాత ప్ర‌తుల‌కే ప‌రిమి తం అయ్యాయి త‌ప్ప ప్ర‌జ‌ల‌కు మేలు చేశాయా లేదా అన్న‌ది మ‌రో ప్ర‌శ్న. ఇప్పుడు దీనిని  ట్రైన్ కౌంట‌ర్ అని అంటున్నా రు. రాజు (చిన్నారి చైత్ర‌ను చంపిన కిరాత‌కుడు) ను కూడా చ‌ట్టం ప‌రిధిలోనే లేని విధంగా చంపి, ప‌ట్టాల‌పై ప‌డేశార‌ని, ఘ‌ట్ కేస‌ర్  కు పోతే ఎన్నో విష‌యాలు అందుతాయ‌ని, సంఘట‌నా స్థ‌లి వ‌ద్ద ల‌భించిన ఫొటో ఆత్మ‌హ‌త్య‌కు  ఆన‌వాలుగా లేదు అని పౌర హ క్కుల నేత‌లు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg