మంత్రి పేర్ని నాని... కేబినేట్ సమావేశ వివరాలను వివరించారు. 1983 నుండి ఆగస్ట్ 15, 2011 వరకు లక్షల మంది పేదలు వివిధ ప్రభుత్వాలు వున్నప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తమ ఇంటి పట్టాలు వడ్డీకి కుదువ పెట్టారు అని ఆయన ఆరోపించారు. వారికి వన్ టైం సెట్టిల్ మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పల్లెల్లో 42లక్షల 3907 మంది, పట్టణ ప్రాంతంలో లో 4 లక్షల మంది...మొత్తం గా 46 లక్షలు మందికి పథకం వర్తింస్తుంది అని తెలిపారు. వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా గ్రామాల్లో 10వేలు పట్టణాల్లో 15 నగరాల్లో 20 వేలు అని అన్నారు.

డిసెంబర్ 21 న ఈ దరఖాస్తు దారులకు ఆస్తికాగితాలు అందించడం అని ఆయన పేర్కొన్నారు. 14,609 కోట్లు మొత్తాన్ని వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరం అని మంత్రి వివరించారు. నవరత్నాలు, పేదలందరికి ఇల్లు కార్యక్రమం కింద 31 లక్షలకు మించి ఇంటి స్థలాలు ఇచ్చాము అని అన్నారు. లక్ష 80 వేల రూపాయలు ఇంటి స్థలానికి కేటాయించారు దానికి అదనం గా పావలా వడ్డీకి మరో 35 వేలు అప్పు బాంక్ ల తో ఇప్పిచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఆయన.

రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు కెబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.  కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగా వాట్లను కేటాయించనున్న ప్రభుత్వం... యూనిట్టుకు రూ. 2.49కు సరఫరా చేసేలా కెబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బికి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్డీసీకి బదలాయించడానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ లో  ఎల్జీ  పాలిమర్స్  సంస్థ  భూముల్లో  ప్లాస్టిక్  పరిశ్రమ ను  తొలగించేందుకు  ఏపీ  కేబినెట్  నిర్ణయం తీసుకుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: