తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కోడెల ద్వితీయ వర్ధంతి కార్యాక్రమం నిర్వహించగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడెల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు... రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేసారు. కోడెలాది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆయన విమర్శించారు. పల్నాడు పులిగా పేరొందిన వ్యక్తిపై నీచమైన ఆరోపణలు చేశారు అని మండిపడ్డారు. మనోనిబ్బరం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కి వచ్చారు అని ఆయన ఆరోపణలు చేసారు.

 చేపట్టిన పదవులన్నింటికీ కోడెల వన్నె తెచ్చారు అన్నారు ఆయన. పరువు కోసం బతికిన కోడెల ఆ పరువు కోసమే ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొన్నారు. కోటప్పకొండ ను ఆదర్శంగా అభివృద్ధి చేశారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి కి ఎంతో కృషి చేశారు అని గుర్తు చేసుకున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్మశానాల నిర్మాణానికి కోడెల చేసిన సేవలు అభినందనీయం అన్నారు ఆయన. కోడెల తరహాలో ఎంతోమంది జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో ఆత్మహత్య చేసుకుంటున్నారు అని మండిపడ్డారు.

నంద్యాలలో అబ్దుల్ సలాం ఘటన మరో ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను నేరాంధ్రప్రదేశ్ చేశారు అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఏడాది తో పోల్చితే 63శాతం నేరాలు పెరిగాయి అని చంద్రబాబు వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ కంటే ఘోరంగా రాష్ట్రంలో మృగాలు పెట్రేగిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు అని ఆయన ఆక్షేపించారు. మాచర్ల, సత్తెనపల్లి, తాడేపల్లి, నెల్లూరు ఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు ఆయన. కావాలి లో ఓ మహిళ అద్దెకిచ్చిన ఇంటికి వైకాపా నేతలు రక్షణ లేకుండా చేశారు అని ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు. ఇక కోడెల వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో కూడా పలువురు నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: