జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తనదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. ఇక రెండున్నరేళ్ల ఏలుబడిలో ఆయన హామీలను మాత్రం నెరవేర్చారనే చెప్పాలి. అయితే జగన్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అన్నది ఒక చర్చగా ఉంది.

2019 నాటికి జగన్ తప్ప ఏపీకి ఎవరూ దిక్కు లేరని అంతా నినదించారు. దాని ఫలితంగా ఆయనకు 151 సీట్లు కూడా దక్కాయి. అయితే సగం పాలన పూర్తి అవుతూనే జగన్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోతోంది అన్న ప్రచారం అయితే స్టార్ట్ అయింది. మరి అది నిజమో కాదో తెలియదు కానీ వైసీపీ మీద మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వ్యతిరేక వార్తలు గట్టిగానే వస్తున్నాయి.

మరో వైపు రెండవ దశ కరోనా తగ్గిన తరువాత విపక్షాలు మంచి స్పీడ్ మీద ఉన్నాయి. వైసీపీని విమర్శించడమే  పనిగా పెట్టుకుని బరిలోకి దిగిపోయాయి. ఏ చిన్న విషయం అయినా వదలకుండా చిరిగి చేట చేస్తున్నాయి. జగన్ సంక్షేమ కార్యక్రమాలలో కూడా లోటు పాట్లు వెతికి జనాల సింపతీని తమ వైపునకు తిప్పుకుంటున్నాయి. నిజం చెప్పాలి అంటే విపక్షం మాటలు జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని తిప్పికొట్టే విషయంలో వైసీపీ బాగా వెనకబడిపోతోంది. అసలు ఏపీలో అధికార పార్టీ వైపున దూకుడుగా ఉండే కొందరు మంత్రులు కూడా ఫుల్ సైలెంట్ అయిపోయారు.

దాంతో వైసీపీ వాయిస్ ఎక్కడా జనాల్లోకి పోవడంలేదు. కనీసం డిఫెన్స్ చేసుకునేందుకు కూడా ఎవరూ రెడీగా ఉండకపోవడం మాత్రం దారుణమే. దీని మీద సీఎం జగన్ అయితే బాగా అసంతృప్తి మీద ఉన్నారని టాక్. ఆయన ఇదే విషయం మీద కొందరు మంత్రులను కూడా గుర్తించారని అంటున్నారు. ప్రభుత్వం మీద విమర్శల జడివాన కురుస్తున్నా చలించని మంత్రుల తీరు మీద ఫైర్ అవుతున్న జగన్ మంత్రి వర్గ విస్తరణ అనే మంత్రదండాన్ని ఉపయోగిస్తారు అంటున్నారు. ఈసారి మాత్రం తీసుకోబోయే మంత్రులు నోరున్న వారే ఉంటారని కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్ అసంతృప్తి మంత్రుల పదవుల మీద పెను ప్రభావమే చూపించే అవకాశాలు అయితే గట్టిగానే ఉన్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: