మండల కేంద్రంలో నిర్వహించిన దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం రసాభాసగా సాగింది.సభ సాక్షిగా అసమ్మతి సెగలు బయట పడ్డాయి.కాంగ్రెస్ దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నాయకులకు పిలుపు అందకపోవడంతో అసమ్మతి సెగలు తీవ్రరూపం దాల్చాయి.ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరై సభను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి అధ్యక్షత వహించారు.సభను నిర్వహించే ఈ క్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులను అధ్యక్ష కార్యదర్శులు సమన్వయం చేయడంలో మండల నాయకత్వం  విఫలం చెందగా,మండల కేంద్రంలో నడిబొడ్డున ఎర్రబెల్లి స్వర్ణ దంపతుల ఫ్లెక్సీ వెలవడం పలు విమర్శలకు దారి తీసింది.అసమ్మతి నాయకులు ఫ్లెక్సీ వద్ద నిలబడి కాంగ్రెస్ మండల నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నాలుగు పార్టీలు మారిన వారికే కాంగ్రెస్లో పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ డిసిసి కార్యదర్శి  లక్ష్మారెడ్డి అన్నారు.మొదటి నుండి పార్టీ ‌కోసం కష్టపడి ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా పక్కనపెట్టి కాంగ్రెస్ సర్పంచ్గా ఐదు సంవత్సరాలు పనిచేసిన,నాకు సరైన గౌరవం గౌరవం ఇవ్వడం లేదని గుండేటి ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో చెల్లి స్వర్ణ దంపతుల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి కారణం పరకాల బరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా స్వర్ణ దంపతులు వస్తున్నారా?దానికి ఫ్లెక్సీ సంకేతమా?అని పలువురు నాయకులు అనుకుంటున్నారు.కాంగ్రెస్ సభ నడిరోడ్డు పైన నిర్వహించడం,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిన కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం గమనార్హం.ఆర్టీసీ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులు కిందకు దిగి కాంగ్రెస్ నాయకులతో,బాహాబాహీకి దిగగా ఏ మాత్రం కాంగ్రెస్ నాయకుల్లో చలనం లేదు.చిన్న పిల్లలు ఆకలితో దాహంతో కేకలు వేసిన కాంగ్రెస్ నాయకులు పెడచెవిన పెట్టినారు.స్థానిక పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించారు.

ఏదిఏమైనప్పటికీ కాంగ్రెస్ దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు బయటపెట్టే వేదికగా మారిందని కాంగ్రెస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అసలు కాంగ్రెస్ కు పరకాల ఎమ్మెల్యే బరిలో ఎవరు ఉంటారు?ఎవరికి సపోర్ట్ చేయాలి ఇంకా ఎంతకాలం ఇలాంటి వర్గ రాజకీయాలు ఉంటాయని మండల కాంగ్రెస్ అభిమానులు నాయకులు అయోమయంలో పడ్డారు.అసమ్మతి తెలిపిన వారిలో మందాడి లక్ష్మారెడ్డి డిసిసి కార్యదర్శి గుండేటి ఎల్లయ్య మాజీ సర్పంచ్ మెట్టుపళ్లి ఏలియా మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు ముత్యాల నగర్ కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీను మండల నాయకుడు మాజీ వార్డు మెంబర్ తదితరులు ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: