బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటాక ష‌ర్మిల చేప‌ట్టిన దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. అటుపై ఆమెను దీక్షా స్థ‌లి నుంచి ప‌ట్టుకుని వెళ్లారు. ఇదంతా ఎందుకు ఆమె చేశారు. పొలిటిక‌ల్ మైలేజ్ ను ఈ సంఘ‌ట‌న నుంచి ఎందుకు కోరుకుంటున్నారు అన్నవి సందేహాలు కాదు తెలిసిన విష‌యాలే. ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా అవ‌న్నీ రాజ‌కీయం కోస‌మే. ఇప్పుడు చైత్ర త‌ర‌ఫున చేస్తున్న పోరాటం కార‌ణంగా ఆమెకు ఇమేజ్ రాలేదు స‌రిక‌దా ఉన్న కొద్ది పాటి గౌరవం కూడా పోయింది. చిన్నారి చైత్ర‌కు నివాళి ఇచ్చి, ఆ కుటుంబానికి అండ‌గా నిల‌వ‌డంలో ఎవ్వరూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ ఇదే  స‌మ‌యంలో పాత‌బస్తీలోనూ ఓ ఘ‌ట‌న జ‌రిగింది. మ‌రి అక్క‌డికి ష‌ర్మిల ఎందుకు వెళ్ల‌రు. మీడియా అటెన్ష‌న్ ఉన్న చోటే ష‌ర్మిల ఉంటారు. లేని చోట ఆమె మాట్లాడ‌రు. అస్స‌లు స్పందించ‌ను కూడా స్పందించ‌రు. 



కొన్ని సంద‌ర్భాల్లో అయినా రాజ‌కీయ నాయ‌కులు హుందాత‌నం పాటించాలి. కొన్ని సంద‌ర్భాల్లో అయినా త‌మ‌కు తామే ఓ ని యంత్ర‌ణ విధించుకోవాలి. కొన్ని సంద‌ర్భాల్లో అయినా న‌లుగురూ ఒప్పుకునేలా మాట్లాడ‌గ‌ల‌గాలి. కానీ తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా రాజ‌కీయం మాత్రం ఒక్క‌టే. అధికార దాహం అంతిమం అన్న‌ది అయి తీరుతోంది. చిన్నారి చైత్ర విష‌యంలోన జ‌రిగిందిదే!


ఓ దుర్మార్గం ఓ కిరాత‌కం కార‌ణంగా చిన్నారి చైత్ర అత్యంత  పాశ‌వికంగా హ‌త్య‌కు గురైంది. అత్యాచారం చేసి చంపేశాడు పాత నేర‌స్తు డు రాజు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా ప‌నిచేస్తున్నారు. అయినా నిందితుడి ఆచూకీ ఇప్ప‌టిదాకా లేదు. ఇదే స‌మ‌యంలో ష ర్మిల మాత్రం దీక్ష‌లంటూ హ‌డావుడి చేసి ఉన్న ప‌రువు పోగొట్టుకుంటున్నారు అని టీఆర్ఎస్ అంటోంది. త‌మ ప‌రిధిలో చేయాల్సి నదంతా చేస్తున్నామ‌ని, ఈ స‌మ‌యంలో రాజ‌కీయం చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg