అప‌రిప‌క్వ ధోర‌ణిలో భాగంగా ష‌ర్మిల మాట్లాడుతున్నారు. చిన్నారి చైత్ర హ‌త్య‌కు గుర‌యిన ఘ‌ట‌న‌పై ఆమె మాట్లాడిందంతా రాజ కీయ ప్ర‌యాస‌లో భాగం. ఇదివ‌ర‌కూ ఎన్నో ఘ‌ట‌న‌లు జ‌రిగాయి అప్పుడు ఆమె మాట్లాడారా..పోనీ న‌గ‌రు శివార్ల‌లో ఆ మ‌ధ్య జ‌రి గిన అత్యాచార ఘ‌ట‌న‌పైన మాట్లాడారా? స‌జ్జ‌నార్ చేసిన ఎన్కౌంట‌ర్ పై మాట్లాడారా? ఎన్న‌డూ లేనిది ఇప్పుడు మాట్లాడ‌డంలో ఆమె రాజ‌కీయ అవ‌స‌రాలు త‌ప్ప సామాజిక బాధ్య‌త అన్న‌ది క‌నిపించ‌డం లేదు. అలా ఆమె రోజురోజుకీ గౌర‌వం పోగొట్టుకుంటు న్నారు. బాధిత కుటుంబానికి ష‌ర్మిల అండ‌గా ఉండాలి. ఉంటే చాలు. ఇంకేం వ‌ద్దు.


వైస్సార్టీపీ అధినేత్రి ష‌ర్మిల వ్యూహాత్మ‌క అడుగులు అన్నీ త‌ప్ప‌ట‌డుగులు అని తేలిపోతున్నాయి. ఆమె కోరుకుంటున్న రాజ్యాధి కారం ఇప్ప‌ట్లో రాక‌పోయినా ఎందుక‌నో ప‌దే ప‌దే త‌ప్పులు చేస్తున్నారు.అన‌వ‌స‌ర సంద‌ర్భాల్లో అన‌వ‌స‌ర ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.



అవ‌స‌రం ఉన్న‌చోట ఆమె మాట్లాడ‌డం లేదు. అవ‌సరం అనుకున్న ఇరు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల‌పై అస్స‌లు నోరు మెద‌ప‌డం లేదు. కేవ‌లం తెలంగాణ‌కు ప‌రిమితమై ఉన్న ప‌నుల‌పైనో మాట‌ల‌పైనో ప‌రిమితం కావ‌డం స‌మంజ‌సం కాదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్ని త‌ప్పిదాలు ఉన్నాయో ఇప్పుడూ రెండు రాష్ట్రాల్లోనూ అన్నే ఉన్నాయి. అన్న అక్క‌డ పాలిస్తున్నాడు క‌దా అని ఎందుకు ఆమె నోరు మెద‌ప‌రు. చైత్ర స‌రే ర‌మ్య మాటేంటి అని ప్ర‌తిప‌క్షాలు అడిగితే అప్పుడు ఏం చెబుతారో.


చిన్నారి చైత్ర ఘ‌ట‌న‌పై రాజ‌కీయాలు చేయొద్దు అని పౌర స‌మాజం విజ్ఞ‌ప్తి చేస్తోంది. ప్ర‌భుత్వం విఫ‌లం అయింద‌ని అప్పుడే ఎలా  చెబుతారు అని ప్ర‌శ్నిస్తోంది. నిందితుడి గాలింపులో పోలీసు బృందాలు ఉన్నాయి క‌నుక వీలుంటే వాటికి సాయం చేయండి. స‌మా చారం ఉంటే వెంట‌నే ద‌ర్యాప్తు బృందాల‌కు అందించండి అంతేకానీ ప్ర‌తి  చిన్న విష‌యం నుంచి పెద్ద విష‌యం వ‌ర‌కూ అన్నింటినీ రాజ‌కీయం చేయాల‌నుకోవ‌డంలో అవివేకం ఉంది. రాజ‌కీయంగా ఎద‌గాల‌నుకున్న ఆలోచ‌నలో భాగంగా త‌ప్ప‌ట‌డుగులు వేయ కూడదు. బాధితులంతా ఈస‌డించుకునే ప‌నులు చేయ‌కూడ‌దు. దీక్ష‌లు చేసి సాధించేదేమీ ఉండ‌దు. అన‌వసరం అయిన దీక్ష‌లు అప్ర‌తిష్ట‌కు కార‌ణం అవుతాయి. ఇవేవీ ప‌ట్టించుకోకుండా కేసీఆర్ పై  పై చేయి సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయ‌డంలో అర్థం లేదు. అర్థ లేని ప‌నులు ష‌ర్మిల అనే కాదు ఎవ్వ‌రూ చేయ‌కూడదు. ప‌రామ‌ర్శ‌ల పేరిట ఇప్పుడు ష‌ర్మిల చేసిన హంగామా కార‌ణంగా ఆమె తెచ్చుకున్న కొత్త పేరు ఏమీ లేదు. దీక్ష‌లు చేసి సానుభూతి పొందాల‌నుకోవ‌డం ఎప్ప‌టి నుంచో వైసీపీకి అల‌వాటులో ఉన్న ప‌నే కానీ ఇప్పుడు అయితే అలా చేయ‌కూడదు అని అంటోంది గులాబీ వ‌ర్గం.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg