అనేక ట్విస్ట్‌ల మధ్య సి‌బి‌ఐ కోర్టు...జగన్ బెయిల్ రద్దుకు నో చెప్పేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, రెండు నెలల క్రితం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తమ నాయకుడు ఏ తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు రావాలంటే కేసులు విచారణ త్వరగా సాగాలని, అందుకే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశానంటూ రఘురామ చెప్పుకొచ్చారు. ఇక పనిలో పనిగా విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్లపై విచారణ జరుగుతూ అనేక రకాలుగా ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూ, చివరికి సి‌బి‌ఐ కోర్టు జగన్, విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దుకు నో చెప్పేసింది. రఘురామ వేసిన పిటిషన్లని కొట్టేసింది. అయితే బెయిల్‌ రద్దు చేయాలన్న తన వ్యాజ్యాన్ని సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ త్వరలోనే హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేస్తానని రఘురామ చెప్పారు. అయితే ఈ బెయిల్ రద్దు పిటిషన్లని కొట్టేయడంపై వైసీపీ శ్రేనూ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు కనిపించింది. అలాగే వైసీపీ శ్రేణులు, రఘురామపై దండయాత్ర మొదలుపెట్టారు. రఘురామ కుట్ర వర్కౌట్ అవ్వలేదని, చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రకు కోర్టు గట్టి షాక్ ఇచ్చిందంటూ మాట్లాడుతున్నారు.

అయితే ఇదే సమయంలో బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయడంపై టి‌డి‌పి శ్రేణులు బాగా అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్తితులని చూసుకుంటే బెయిల్ రద్దు పిటిషన్‌లని కొట్టేయడంపై టి‌డి‌పి శ్రేణులే ఇంకా సంతోషంగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడుప్పుడే జగన్ ప్రభుత్వంపి వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో బెయిల్ రద్దు అయ్యి జగన్ జైలుకు వెళితే, మళ్ళీ ప్రజల్లో సింపతీ పెరిగిపోతుంది. అప్పుడు వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందని, ఇప్పుడు బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయడం వల్ల జగన్ ప్రజల్లోనే ఉంటారని, ఇంకా ఆయన గురించి తెలుస్తుందని, అప్పుడు మరింత వ్యతిరేకత వస్తుందని, అదే టి‌డి‌పికి ప్లస్ అవుతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: