టీఆర్ఎస్ పై రాజ‌కీయ యుద్దాన్ని ఇప్ప‌టికే మొద‌లు పెట్టిన కాంగ్రెస్‌.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామ‌కం త‌రువాత అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అధికార పార్టీని క‌డిగి పారేస్తోంది. ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై ఉద్య‌మం మొద‌లు పెట్టిన రేవంత్ అండ్ కో.. ఇప్పుడు త‌న గేర్‌ను మార్చిన‌ట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు రాజ‌కీయ పోరాటం చేసిన కాంగ్రెస్ ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న శాంతిభ‌ద్ర‌తల విష‌యంలో ఫోక‌స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ దిశ‌గా ముందుకు వెళ్లోంది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అధ్వాన్నంగా మారాయ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డ్ర‌గ్స్‌, అత్యాచారాలు, హ‌త్య‌ల‌కు తెలంగాణ అడ్డ‌గా మారింద‌ని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.


    ఈ విష‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై కేంద్ర హోం మినిస్ట‌ర్‌కు కంట‌ప్లైంట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట రేవంత్ రెడ్డి, ఇదే విష‌య‌మై అమిత్ షాకు అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ నిన్న లేఖ రాశారు. అందులో అపాయింట్ మెంట్ ఇవ్వాల‌ని కోరారు. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై విన‌తి ప‌త్రం కూడా ఇస్తామ‌ని దీని కోసం కొంత స‌మ‌యాన్ని అమిత్‌షాను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరాడ‌ట‌. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని  ఈ రోజు (సెప్టెంబ‌ర్ 17) తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ నిర్మ‌ల్ లో ఏర్పాటు చేసిన స‌భ‌లో అమిత్ షా పాల్గొన‌నున్నారు.


   నిర్మ‌ల్ జిల్లాలోని వెయ్యిఉరిల మ‌ర్రి స‌మీపంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బీజేపీ స‌భ‌కు కేంద్ర‌హోం శాఖా మంత్రి అమిత్ షా రానున్నాడ‌ని తెలంగాణ బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇందులో పాల్గొన‌డానికి వ‌చ్చిన సంద‌ర్భంలో త‌మ‌కు కాస్త స‌మ‌యం ఇవ్వాల‌ని అమిత్‌షా ను రేవంత్ రెడ్డి కోరారు. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లొ చ‌ర్చ మొద‌ల‌యింది. డ్ర‌గ్స్ దందాకు హైద‌రాబాద్ కేంద్రంగా మారింద‌ని, అలాగే రాష్ట్రంలో అశాంతి, అభ‌ద్ర‌తా పెరిగిపోతున్నా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ విష‌యాల‌పై విన‌తి ప‌త్రం అందించేందుకు అమిత్ షాను అపాయింట్‌మెంట్ కోరారు. మ‌రి అమిత్ షా రేవంత్ కు టైం ఇస్తారా లేదా అని వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: