భార‌త‌దేశంలో ప్ర‌జల ఆర్థిక అస‌మాన‌త‌ల గురించి గ‌తంలో ఎన్నో నివేదిక‌లు వ‌చ్చాయి. తాజాగా భార‌త ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఆస్తుల స‌ర్వే ద్వారా ఆందోళ‌నక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం దేశంలోని 10 శాతం మంది చేతిలో 50 శాతం ఆస్తులు కేంద్రీకృత‌మ‌యి ఉన్నాయి. క‌రోనా స‌మ‌యంలో బిలినీయ‌ర్ల సంఖ్య పెరిగింది అలాగే పేద‌ల సంఖ్య కూడా పెరిగింది. వ‌ర‌ల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్ర‌కారం క‌రోనా స‌మ‌యంలో 7.5 కోట్ల మంది కొత్త‌గా పేద‌రికంలోకి వెళ్లిపోయారు. పాండ‌మిక్ స‌మ‌యంలో భార‌త వృద్ది -7 శాతం ప‌డిపోయింది. అలాగే కార్పొరేట్ ప్రాఫిట్స్ గ‌ణ‌నీయంగా పెరిగిపోయాయి.


   ఆర్థిక అస‌మాన‌త‌లు మ‌న దేశంలో పెద్ద ఛాలెంజ్‌గా ఉంది. అతి త‌క్కువ‌గా కాశ్మీర్‌లో  ఎక్కువ‌గా ఢిల్లీలో ఆర్థిక అస‌మాన‌త‌ల మ‌ధ్య తేడాలు ఉన్నాయి. ఆదాయాల అస‌మాన‌త‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పెద్ద ఎత్తున అంత‌రాల‌ను సృష్టిస్తున్నాయి. వృద్ది రేటు పెరిగింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తుంటాం. ఈ ఏడాది ప్ర‌థ‌మ ఆర్థిక త్రైమాసికంలో గ‌త ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ది పెరిగింద‌ని చెబుతున్నారు. నిజానికి రెండు నెల‌ల పాటు లాక్ డౌన్ ఉంది. ఈ స‌మ‌యంలో బేస్ -24 శాతం ఉంది. దీంతో బేస్ త‌క్కువ‌గా ఉంది కాబట్టి ఆర్థిక వృద్ది రేటు పెరిగింద‌ని అనిపిస్తుంది. ఐఎంఎఫ్ చీఫ్ గీతాగోపినాథ్ ప్ర‌కారం ఇది కేవ‌లం మ్యాథ‌మేటిక‌ల్ గ్రోత్ మాత్ర‌మే.


    వృద్ది అంటే జాతీయాదాయంలో వృద్ది దీంట్లో పేద‌లు, ధ‌న‌వంతులు అంద‌రూ వ‌స్తారు. ముఖేష్ అంబానీ, ముష్టివాడి ఆదాయాన్ని స‌గ‌టు చేస్తే దేశ త‌ల‌స‌రి ఆదాయం వ‌స్తుంది. కానీ  దీని వ‌ల్ల పేదవాళ్ల ఆర్థిక ప‌రిస్తితి పెరిగింద‌ని చెప్ప‌డానికి లేదు. దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ కొనుగోలు శ‌క్తి పెర‌గ‌డం ద్వారా ఆర్తిక అస‌మాన‌త‌లు త‌గ్గిపోతాయి. ఆర్థిక అస‌మాన‌త‌లు తొల‌గాలంటే ప్ర‌భుత్వం కావాల్సిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మేధావులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: