జగన్ సొంత వ్యూహాలతో రాజకీయం చేయలేరా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ లేనిదే...రాజకీయంగా చంద్రబాబుని ఎదురుకోలేరా? అంటే జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అసలు జగన్ సొంత వ్యూహాలతో ముందుకెళుతున్నారా అనేది కూడా కాస్త డౌట్‌గానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి జగన్‌ని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నారు.

ఆయన ఎలా చెబితే అలాగే జగన్ రాజకీయం ఉంటుంది. ఇంతవరకు రాష్ట్రంలో అరాచకమైన రాజకీయం జరగడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహలే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎక్కడకక్కడ చంద్రబాబుకు చెక్ పెట్టడానికి జగన్...పీకే టీంని అడ్డం పెట్టుకుని రాజకీయం నడుపుకుంటూ వచ్చింది. పీకే టీం చెప్పినట్లే జగన్ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. పీకే టీం అటు క్షేత్ర స్థాయిలో వైసీపీ నేతలతో కలిసిపోయి తమదైన శైలిలో రాజకీయం చేసి టి‌డి‌పిని దెబ్బకొట్టారు.

అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా చంద్రబాబు ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే జగన్ పాలన కూడా పీకే ఇచ్చిన సలహాలు మేరకే నడుస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక త్వరలోనే పీకే టీం మళ్ళీ రాజకీయ పరంగా రంగంలోకి దిగబోతుందని జగన్, తమ మంత్రివర్గానికి హింట్ ఇచ్చేశారు. వచ్చే ఏడాది మార్చి నుంచి పీకే టీం రంగంలోకి దిగుతుందని రాష్ట్రమంతా పర్యటిస్తూ... పాలన, పథకాలపై సర్వే చేస్తుందని, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపైనా ఆరా తీస్తుందని తెలుస్తోంది.

అలాగే వచ్చే ఏడాది నుంచి తనతో సహ అందరూ జనంలోకి వెళ్లాలని జగన్ నిర్దేశించారు. అంటే 2024 ఎన్నికల టార్గెట్‌గా పీకే టీం పనిచేయనుందని తెలుస్తోంది. కాకపోతే పీకే టీం లేకుండా సొంత వ్యూహాలతో జగన్ రాజకీయం చేయడం కష్టమే అని తెలుస్తోంది. మ‌రో వైపు తెలంగాణ‌లోనూ జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల పార్టీ కోసం పీకే రంగంలోకి దిగుతున్న‌ట్టు మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: