హుజురాబాద్  నియోజకవర్గం పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా  మార్మోగుతోంది. ఈ నియోజకవర్గ రాజకీయాలన్నీ ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. ఈ యొక్క ఎన్నిక అన్ని రాజకీయ పార్టీల భవిష్యత్ కార్యాచరణపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.  అందుకోసమే ఈ ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికపై టిఆర్ఎస్  పట్టించుకోవడం లేదని చెబుతూనే హుజురాబాద్ లో తెరాస నాయకులు అందరిని దించి కెసిఆర్ వ్యూహాలతో  అన్ని పార్టీల ఆలోచనలను  వారికి అనుగుణంగా మార్చుకుంటూ ఎంతో  వ్యూహంతో ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు..  అదే వ్యూహంతో బిజెపి, కూడా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు కాంగ్రెస్ నాయకులు అసలు ఈ ఎన్నికను కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంటుందా..?

హుజురాబాద్ ఉప ఎన్నికపై  కాంగ్రెస్ ఏం ఆలోచిస్తోంది..? దీని వెనుక ఏదైనా వ్యూహాత్మక ఉందా  లేదా ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోతామనే భయం పట్టుకుందా..? కాంగ్రెస్ మదిలో ఏముందో ఇప్పటికీ అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది..? కానీ తెరాస మరియు బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ యొక్క ఉప ఎన్నికను మంత్రి హరీష్ రావు దగ్గరుండి చక్రం తిప్పుతున్నారు. అయితే హుజురాబాద్ లో టిఆర్ఎస్ కు ఎంతో పట్టు ఉంటుంది. అది  మళ్లీ తెరాసకు  కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఎందుకంటే  ఈటల రాజేందర్ బిజెపిలో చేరడం ప్రచారంలో కూడా బీజేపీ అధిష్టానం పిల్లలకు ఎక్కువగా సహకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో  ఎంతో మంది నేతలు టిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెరాస తరఫున పోటీలో ఉన్నటువంటి  గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ లో స్థానిక నేత కాబట్టి బీసీ సామాజికవర్గానికి చెందిన ఓట్లు హుజురాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి.

ఇది  గెల్లు శ్రీనివాస్ కు ఎక్కువగా కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. అయితే మొదట్లో ఈటెల  ఎంతో దూకుడుగా వ్యవహరించినా తెరాస వ్యూహం ముందు కాస్త తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అటు హరీష్ రావు, ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ సారథ్యంలో  ప్రచార హోరు నడిపిస్తున్నారు. హుజరాబాద్ మొత్తం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల నాడి  టిఆర్ఎస్ కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజేందర్ అక్కడ మంచి పేరున్నా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ప్రచారంలో వెనుకబడి పోతున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే టీఆర్ఎస్ వ్యూహం  ముందు హుజురాబాద్ రాజకీయమంతా వన్ సైడ్ గా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజల మనసులో ఏముందో ఎన్నికల అయితే గాని తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: