ప‌వ‌న్ బీజేపీ బంధం మ‌ళ్లీ బ‌ల‌ప‌డింది. బ‌ల‌మ‌యిన ప్ర‌భుత్వం ఇది అని ప‌వ‌న్ ఎందుకు న‌మ్ముతున్నారో కానీ మోడీ ప్ర‌భుత్వా న్ని మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. రోడ్ల నిర్మాణంలో జాతీయ ర‌హ‌దారుల సంస్థ చేప‌డుతున్న చ‌ర్య‌ల విష‌యంలో ప‌వ‌న్ మోడీ ప్ర‌భు త్వాన్ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా నిజంగా ఇది న‌రేంద్ర మోడీకి తెలుగు రాష్ట్రాల నుంచి ద‌క్కిన అతి పెద్ద కానుక. వ‌చ్చే ఎన్నిక‌లలో జ‌న‌సేన, బీజేపీ స్నేహం అన్న‌ది ఖాయం. దీంతో జ‌గ‌న్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాల‌ని ప‌వ‌న్ అభిమా నులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. పైకి న‌వ్వులు రువ్వుతున్నా మోడీ ఎప్ప‌టి నుంచో వైసీపీని త‌ప్పించాల‌ని చూస్తున్నా రు. తాము అడ‌గ‌కున్నా కొన్ని బిల్లుల విష‌య‌మై కేంద్రానికి వైసీపీ మ‌ద్దతు ఇవ్వ‌డంపై  మోడీ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.


అదేవిధంగా ఇదే అదునుగా కేంద్రాన్ని కొన్ని గొంతెమ్మ కోరిక‌లు కోరడం కూడా మోడీకి న‌చ్చ‌లేదు. ముఖ్యంగా ముఖ్య‌మంత్రి సంక్షేమ ప‌థ‌కాల‌పై నిర్మలా సీతారామన్ ఎప్ప‌టి నుంచో అసంతృప్తితో ఉన్నారు. ఇవ‌న్నీ ప‌రిశీలించి మోడీ ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ ను వ‌దిలించుకోవా ల‌న్న ఆలోచన‌లో భాగంగానే రాష్ట్రంలో బీజేపీ బ‌లప‌డేందుకు ఉన్న దారుల‌న్నింటినీ వెతుకుతున్నారు. ఇందులో భాగంగా జ‌న‌సేన సాయం తీసుకోవాల‌ని భావిస్తున్నారు. సోము వీర్రాజు కానీ బండి సంజ‌య్ కానీ ఇలాంటి లీడ‌ర్ల వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని తేలిపోయా క ప‌వ‌న్ లాంటి  ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న లీడ‌ర్ల‌ను రెండు తెలుగు రాష్ట్రాల‌లో వాడుకోవాల‌ని యోచిస్తున్నారు మోడీ.ఈ ద‌శ‌లో ప‌వ‌న్ మ‌ళ్లీ కేంద్రాన్ని పొగ‌డ్త‌ల‌లో ముంచెత్త‌డంతో సామాజిక మాధ్య‌మాలు ఇవాళ ఎలా అయినా హోరెత్తిపోవ‌డం ఖాయం. జ‌న‌సేన శ్రేణుల‌కూ, వైసీపీ వ‌ర్గాల‌కూ త‌గ‌వులు ఖాయం. ఎప్ప‌టి నుంచో క్షేత్ర స్థాయిలో ప‌వ‌న్ తో బీజేపీ  ప‌నిచేయాల‌నుకోవ‌డంతో ప‌వ‌న్ చెప్పిన మాట‌లు క‌మ‌ల‌నాథుల‌కు మ‌రో ఎన‌ర్జీ పాయింట్ కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: