విమోచ‌న దినోత్స‌వం కాస్త రాజ‌కీయాలకు అడ్డ‌గా మారిపోయింది. ర‌జ‌కార్ల ఆగ‌డాల‌ను ఎదిరించి పోరాడిన రోజు కాస్త ఇలా చీక‌టి రాజ‌కీయాల‌కు వేదిక‌గా మిగిలిపోవ‌డం కాస్త కాదు ఎక్కువ బాధాక‌ర ప‌రిణామ‌మే. వీరుల‌ను మ‌రిచి కేవ‌లం అవ‌స‌రార్థ రాజ‌కీయా ల‌ను  త‌మ‌కు త‌మ స‌న్నిహిత వ‌ర్గాల‌కు చేరువ చేసేందుకు పార్టీలు చేస్తున్న ప్ర‌య‌త్న‌మే హేయం. ఇది తెలంగాణ‌కు స్వాతంత్ర్యం వ‌చ్చిన రోజు అని చెబుతూ రేవంత్ త‌న‌దైన రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా త‌గ‌ని ప‌ని. ఇవ‌న్నీ ఈ రోజు ఎందుకు మాట్లా డుతున్నారు. నిజాం న‌వాబును ఎదిరించిన ధీర‌గుణం ఏదీ ఇవాళ తెలంగాణ‌లో స్మ‌ర‌ణ‌కు రాదేంటి?


ఇవాళ తెలంగాణ అంతటా విమోచ‌న దినంగా పాటిస్తున్నారు. కాంగ్రెస్ తో స‌హా బీజేపీ ఇతర పార్టీలు ఇదే అదునుగా టీఆర్ఎస్ ను ఇర‌కాటంలో పెట్టేందుకే రాజ‌కీయం చేస్తున్నాయి. అస‌లు స్ఫూర్తిని వ‌దిలి ఈ వేళ‌ను త‌మ‌కు అనుగుణంగా మార్చుకుంటున్నా యి. ముఖ్యంగా ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేసి మ‌త‌వాద రాజ‌కీయాల‌ను మ‌ళ్లీ త‌ట్టిలేపుతోంది. దీంతో విభిన్న వాతావ‌ర‌ణం న‌డుమ విమోచ‌న దినం ఈ సారి రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యాన్ని ద‌క్కించుకుంది. అస‌లు ల‌క్ష్యం వ‌దిలి ర‌జ‌కార్ల ఆగ‌డాల‌ను అణ‌చివేసిన వీరుల స్మ‌ర‌ణ క‌న్నా కేసీఆర్ పై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించేందుకు మాత్ర‌మే ఈ రోజును, ఈ సంద‌ర్భాన్ని వాడుకోవ‌డం వెనుక అత్యంత హేయ‌మ‌యిన స్థితిలో రాజ‌కీయ పార్టీలు అన్నీ ఉన్నాయి అనేందుకు ఎటువంటి సందేహ‌మూ లేదు.





ముఖ్యంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కూడా అంగీకార యోగ్యంగా లేవు. నాటి పోరాట స్ఫూర్తిని స్మ‌ర‌ణ‌కు తీసుకురాగ‌పోగా., వీరుల‌ను త‌లుచుకునే క్ష‌ణాల‌ను త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వినియోగించుకునేందుకు  ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మే విచార‌క‌రం. అదేవిధంగా నాటి అమ‌రుల‌కు, ఇప్ప‌టి అమ‌రుల‌కు కేసీఆర్ కానీ లేదా బీజేపీ కానీ చేసిన సాయం ఏమీ లేద‌న్న‌ది ఓ వాస్త‌వం. అలాంట‌ప్పుడు కేసీఆర్ ను తిట్టిపోయ‌డంలో అర్థం లేదు. ఓ వైపు కేంద్రం కేసీఆర్ కు కావాల్సినంత సాయం చేస్తున్న‌ప్పుడు, కిష‌న్ రెడ్డి లాంటి వారు తిట్ట‌డం స‌బబు కాదు. ర‌జ‌కార్ల ఆగ‌డాల నుంచి విముక్తం ల‌భించిన రోజును ఈ విధంగా రాజ‌కీయ నాయ‌కులు ఇప్ప‌టి రాజ‌కీయ ప‌రిణామాల‌కు అనుసంధానిస్తూ మాట్లాడ‌డంలో పెద్ద‌గా ప్ర‌యోజ‌న‌మేమీ లేదు. ఇక విమోచ‌న దినోత్స‌వానికి సంబంధించి తాము ప్ర‌భుత్వ ప‌గ్గాలు అందుకోగానే అధికారికంగా చేప‌డ‌తామ‌ని చెప్ప‌డం పెద్ద హామీ కాక‌పోయినా ఇది కూడా బీజేపీ బాజాకు ఉప‌యోగ‌ప‌డుతుంది అనుకోవ‌డం అవివేకం అని, అదేవిధంగా సంబంధిత చ‌రిత్ర‌ను పాఠ్యాంశాల్లో చేర్చ‌డం కూడా పెద్ద విష‌య‌మేమీ కాదు. అయినా వీటిని  కిష‌న్ రెడ్డి వీటినొక గొప్ప విష‌యాలుగా ప్ర‌జ‌ల ముందుకు తీసుకుని రావ‌డంలో రాజ‌కీయంగా ఎదుగుద‌ల కోరుకోవ‌డం త‌ప్ప వీరంతా ప్ర‌జ‌ల కోసం గొప్ప‌గా చేసిందేదీ లేదు అన్న‌ది సుస్ప‌ష్టం అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg