ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల బాంబు పేలింది. గురువారం జ‌రిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేలా.. సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గానికి సంకేతాలు పంపేశారు.``మీరంతా జ‌నంలో ఉండాలి. నేను కూడా త్వ‌ర‌లోనే జ‌నంలోనే ఉంటాను`` అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికిప్పుడు.. ఎన్నిక‌లు లేక‌పోయినా.. ఆయ‌న ఎందుకు ఈ విధ‌మైన సూచ‌న‌లు చేశారు?  ఎందుకు మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను జ‌నాల్లో ఉండాల‌ని సూచించారు? అనేది ఇప్పుడు మేధావుల మెద‌ళ్ల‌కు ప‌దును పెడుతున్న అంశం.

రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి కేవ‌లం రెండున్న‌రేళ్లు పూర్త‌వుతోంది. నిజానికి జ‌గ‌న్ వంటి ఒక కొత్త ముఖ్య‌మం త్రికి, దాదాపు ఏడేళ్లు ఎదురు చూసిన త‌ర్వాత ద‌క్కిన అధికారానికి ఈ రెండున్న‌రేళ్లు చాలా త‌క్కువ స‌మ య‌మ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణ‌మేంటి?  అంటే.. ప్ర‌ధానంగా ఇప్ప‌టికిప్పుడు మూడు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒక‌టి:  ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన బుద్ధి చెప్ప‌డం. ఔను.. జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత క‌నీసం ఆరు మాసాలు ఆయ‌న‌కు స‌మ‌యం ఇస్తామ‌ని.. త‌ర్వాతే పాల‌న‌పై త‌మ కామెంట్లు చేస్తామ‌ని చెప్పిన‌.. టీడీపీ స‌హా వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన‌, బీజేపీ వంటి ప్ర‌తిప‌క్షాలు.. క‌నీసం .. మూడు మాసాలు కూడా ఊపిరి పీల్చుకోకుండా.. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాయి. ఇక‌, ఇటీవ‌ల కాలంలో టీడీపీ మ‌రింత జోరుగా విమ‌ర్శ‌లు చేస్తోంది. దీనికి క‌ట్ట‌డి చేయ‌డం అంటే.. నేరుగా నోరు పారేసుకోవ‌డం కంటే.. కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి తీర్పు కోర‌డ‌మే మంచి ద‌నే బావ‌న‌తో జ‌గ‌న్ ఉన్నార‌ని అంటున్నారు.

రెండు:  పాల‌న చేత‌కాద‌నే విమ‌ర్శ‌ల‌కు చెక్‌:  సీఎం జ‌గ‌న్ ముందస్తు ఎన్నిక‌లకు వెళ్తుండ‌డం వెనుక‌.. ఇది కూడా ప్ర‌ధాన కార‌ణంగానే క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాద‌ని.. రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయ‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే.. జ‌నాల్లోకి వెళ్ల‌డ‌మే మంచిద‌ని.. త‌న పాల‌న బాగుందో లేదో .. ప్ర‌జాతీర్పు ద్వారానే తేల్చుకోవాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

మూడు:  విప‌క్షాల‌కు చెక్‌:  ఇది అత్యంత ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు పూర్త‌యి.. రెండున్న‌రేళ్లు మాత్ర‌మే గ‌డిచిన నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు ఇంకా కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. సో.. ఈ స‌మ‌యంలో తాను విజృంభించ‌డం ద్వారా.. మ‌రింత‌గా క్లీన్ స్వీప్ చేయాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ని అంటున్నారు. అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: