బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చినప్ప‌టి నుంచి ప్ర‌భుత్వ రంగాల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా అమ్మేందుకు నిర్ణ‌యించింది. దీంతో ఆ ప్ర‌క్రియ‌ను వేగం చేసింది ప్ర‌భుత్వం ఎయిర్ ఇండియాను కొనే ఆస‌క్తి క‌లిగిన వారు బిడ్స్‌ను దాఖ‌లు చేయ‌డం మొద‌లుపెట్టార‌ని స‌మాచారం. ఈ సంస్థ‌ను కొనేందుకు టాటాస్ తో పాటు స్పైస్ జెట్ యాజ‌మాన్యం ఇప్ప‌టికే బిడ్ ల‌ను దాఖ‌లు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు 70 సంవ‌త్స‌రాల క్రితం  నెహ్రూ ప్ర‌భుత్వం జాతీయం చేసిన సంస్థ‌ను మోడీ స‌ర్కార్ అమ్మేయ‌నుంది.


   దేశం గురించి ఏ విష‌యం వ‌చ్చినా నెహ్రూను నిందించే బీజేపీ నేత‌లు.. ఆశ్చ‌ర్యంగా నెహ్రూ ప్ర‌భుత్వం హ‌యాంలో జాతీయం చేసిన సంస్థ‌ల‌ను ఇప్పుడు అమ్ముతోంది అదే బీజేపీ ప్రభుత్వం అండ్ మోడీ గ్యాంగ్.  నెహ్రూ ఏం చేశాడు? అంటూ ప‌దే ప‌దే అడుగుతున్న కాషాయ నేత‌ల‌కు దిమ్మ‌తిరిగేలా ఇప్పుడు మోడీ అమ్మ‌డానికి ఆస్తుల‌ను ఇచ్చాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు కాంగ్రెస్ లీడ‌ర్లు.


    1933లో ఎయిర్ ఇండియాను స్థాపించిన జేఆర్డీ టాటా ఆ సంస్థ‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. భార‌త స్వ‌తంత్య్రానంత‌రం ఎయిర్ ఇండియాను జాతీయీ క‌ర‌ణ‌ చేసింది నెహ్రూ ప్ర‌భుత్వం . ఆ ప‌రిణామంతో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ జేఆర్డీ కి త‌ర్వాత చాలాకాలం విలువ ఇచ్చింది నెహ్రూ ప్ర‌భుత్వం. ఎయిర్ ఇండియా విష‌యంలో ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటూ.. జాతికి ఒక ఆస్తిని నిర్మించింది. జ‌న‌తా ప్ర‌భుత్వం వ‌చ్చే వ‌ర‌కూ కూడా టాటాల‌కు ఎయిర్ ఇండియాతో సాన్నిహిత్యం ఉండేది.


    జ‌న‌తా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత‌ టాటాల‌ను ఎయిర్ ఇండియాకు దూరం చేశారు. చివ‌రికి ఇప్పుడు ఎయిర్ ఇండియాను అమ్మ‌కానికి పెట్టింది. తమ సామర్థ్యం గురించి అమోఘ‌మైన రీతిలో చెప్పుకునే మోడీ ప్ర‌భుత్వం ఆ సత్తా అంతా జాతీయ ఆస్తుల‌ను అమ్మ‌డంలో అని చూపిస్తోందంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: