ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సీఎం జ‌గ‌న్‌.. రెడీ అవుతున్నారు. ఈ విష‌యాన్ని నేరుగా చెప్ప‌క‌పోయినా.. దీనికి సంబంధించిన సంకేతాలు మాత్రం ఇచ్చేశారు. స‌రే! అధికార పార్టీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే.. టీడీపీ ఎలా ముందుకు వెళ్తుంది? ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తుంది? ఇప్పుడున్న ప‌రిస్తితి టీడీపీకి క‌లిసి వ‌స్తుందా?  అనేది ఆస‌క్తిగా మారాయి. ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంద‌నేది వాస్త‌వం. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీకి 23 స్థానాలు మాత్ర‌మే ల‌భించాయి. త‌ర్వాత‌.. వీరిలోనూ న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో సీనియ‌ర్లు చాలా మంది ఓడిపోయారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌నే కార‌ణంగా.. వీరు దూరంగా ఉంటున్నార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో ఇప్పుడుఉన్న నాయ‌కుల్లోనూ చాలా మంది రిటైర్మెంట్‌కు రెడీ అయిన వారే. సో.. చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని.. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఏవీ ఆయ‌న చేప‌ట్ట‌లేదు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించినా.. ఆ ప్ర‌య‌త్నం వ‌ల్ల పార్టీ పుంజుకున్న దాఖ‌లాలు త‌క్కువ‌గానే ఉన్నాయి.

ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధికి వ‌స్తే.. టీడీపీ చాలా వీక్‌గా ఉంది. ప్రాంతాల వారీగా.. రాయ‌ల సీమలో క‌ర్నూలు టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంది. ఎవ‌రికివారే య‌మునా తీరే అన్న విధంగా నాయ‌కులు  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌డ‌పలో పార్టీని న‌డిపించేవారు క‌రువ‌య్యారు. ఇక‌, అనంత‌లో నాయ‌కుల మ‌ధ్య పొస‌గడం లేదు. ఇక‌, కోస్తా జిల్లాల్లోనూ ఆధిప‌త్య ర‌రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లో.. ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. శ్రీకాకుళంలో పార్టీకి నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి వారుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సో.. రాష్ట్ర వ్యాప్తంగా .. టీడీపీ ప‌రిస్థితిదాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందిగానే ఉంది.

మ‌రి ఈ స‌మ‌యంలో ఇప్ప‌టికిప్పుడు.. ముంద‌స్తు వ‌స్తే.. నాయ‌కుల‌ను వెతుక్కోవ‌డం.. టీడీపీకి త‌ల‌కుమించిన భారంగానే మార‌నుంది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే.. ఏం చెప్పాలి..?  నిన్న మొన్న‌టి వ‌రకు త‌మ‌దే పాల‌న‌. మ‌రోవైపు.. నాయ‌కుల మ‌ద్య ఆధిప‌త్య పోరు.. వెర‌సి.. టీడీపీకి ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఈ ముంద‌స్తును ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: