లోక్ స‌భ‌లో అడ‌గాల్సిన‌వి అడ‌గ‌రు. రాజ్య‌స‌భ‌లోనూ అడ‌గాల్సిన‌వి అడ‌గ‌రు. కేవ‌లం మ‌న ఎంపీలంతా త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోస‌మే కేంద్రం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నార‌న్న‌ది ఓ వాస్త‌వం. మ‌న‌కు రావాల్సిన నిధుల విష‌య‌మై ఒక్క‌రైనా ప‌ట్టుబ‌ట్ట‌రు. కేంద్రం అనేక నిధుల‌లో క‌రోనా పేరిట కోత‌లు పెట్టినా అడిగే నాథుడే లేడు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా జ‌గ‌న్ మాత్రం మోడీ స్నేహాన్ని వీడ‌డు. దీంతో రాష్ట్రం ఆశించిన పురోగ‌తిని సాధించ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. ఒక‌వేళ బీజేపీతో బంధం తెంపుకున్నా కూడా రాష్ట్రంకు చెందిన ఎంపీలు పోరాడుతారు అనుకోవ‌డం కూడా వాస్త‌వ దూర‌మే అవుతుంది. ఇప్ప‌టిదాకా నాబార్డు కానీ మ‌రొక‌టి కేంద్రం నుంచి వ‌చ్చే నిధులతో చేప‌ట్టే ప‌నులు కానీ ఏవీ కూడా సానుకూలంగా లేవు. ఇక‌పై ఉండ‌వు కూడా! ఎందుకంటే కేంద్రం ఉచిత ప‌థ‌కాల‌కు నిధుల‌ను సమ‌కూర్చేందుకు సిద్ధం లేదు. మోడీ కూడా మ‌న ప‌థ‌కాల‌పై పెద‌వి విరుస్తున్నా పైకి ఆ బాధ ఏంట‌న్న‌ది చెప్ప‌డం లేదు. ఇదే ద‌శ‌లో కాగ్ కూడా జ‌గ‌న్ కు అక్ష‌త‌లు వేస్తుంది. వీట‌న్నింటిపై రాష్ట్ర బీజేపీ మాట్లాడ‌కున్నా కేంద్ర బీజేపీ అడ‌గ‌కున్నా జ‌గ‌న్ కు చేసే సాయం మాత్రం సున్నా!రాష్ట్రానికి ఏమీ ఇవ్వ‌క‌పోయినా, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌క‌పోయినా జ‌గ‌న్ మోడీని ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నాడు. కేవ‌లం కేసుల విష‌య‌మై ఆయ‌న తలొగ్గారా లేదా మునుపటి పోరాట స్ఫూర్తి ఆయ‌న క‌న‌బ‌ర‌చ‌డం లేదా అన్న‌ది అంతుపోల‌డం లేదు అంతు తేల‌డం లేదు కూడా! దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావ‌డం లేదు. పోనీ అప్పుల‌యినా పుడుతున్నాయా అంటే అదీ లేదు. జీఎస్టీ బ‌కాయిల చెల్లింపుపై కూడా అస్ప‌ష్ట‌తే ఉంది. ఇంకేం కావాలి? ఇంకేం రావాలి?


సాయిరెడ్డి మొద‌లుకుని మిగ‌తా ఎంపీలంతా మోడీ భ‌జ‌న‌లోనే ఉన్నారు. ఉన్నారు అన‌డంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇప్ప‌టికీ వారు అడిగేది ఏమీ లేదు. కేవ‌లం రెబ‌ల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ పై ఫిర్యాదులు ఇవ్వ‌డం త‌ప్ప వీళ్లేం చేస్తున్న‌దీ లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ రాష్ట్రాన్ని ఏ విధంగా పురోభివృద్ధి చేస్తాడ న్నది అంతుప‌ట్ట‌డం లేదు. ఒక‌వేళ ఆయ‌న ముందుస్తు ఎన్నిక‌లు అంటూ ఓ ముస‌లం బ‌య‌లుదేరిస్తే ముందు న‌ష్ట‌పోయేది జ గ‌నే!2023 నాటికి ఎన్నిక‌ల జ‌పం ఒక‌టి తీసుకువ‌స్తే రాష్ట్రంలో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap