కొన్ని న‌గ‌రాల‌ను ఎంపిక చేశాడు మోడీ. పోనీ వాటికి నిధులు ఇచ్చాడా అంటే అదీ లేదు. బెంగ‌ళూరు, హైద్రాబాద్, విజ‌య‌వాడ, విశాఖ‌, చెన్నై ల‌ను అభివృద్ధి చేయ‌మ‌ని అడుగుతుంటే వాటి ఊసే లేదు. వ‌న‌రులు మ‌న‌వి సోకులు కేంద్రానివి అన్న చందంగా మోడీ పాల‌న ఉన్నా ద‌క్షిణాది ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వం, అడ‌గ‌లేని త‌నం కార‌ణంగా త‌రుచూ స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి.


చిల్లర  రాజ‌కీయాలు అన‌లేం కానీ హుందాత‌నం అయితే లేని రాజ‌కీయాలు ఇవే అని త‌ప్ప‌క చెప్పాలి. ద‌క్షిణాది నుంచి బీజేపీకి స‌రైన రాజకీయ ప్రాధాన్యం ద‌క్క‌నందున ఈ ప్రాంతానికి స‌వ‌తి త‌ల్లి ప్రేమే చూపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏం అడిగినా ఇదిగో అదిగో అని కాలం నెట్టుకువ‌స్తోంది. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల‌కు చేయాల్సిన సాయం కూడా చేయాల‌న్న ఆలోచ‌న‌లో లేదు. ఎంత సేపు జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి ఒక్క‌టే త‌న ప్రాధాన్యం అన్న‌ది చాటుకుని మిగిలిన ప‌నులు అట‌కెక్కిస్తుంది. రాష్ట్రాలు కూడా ఒక ప‌రిశోధ‌న కేంద్రం అడ‌గ‌డమో, వృత్తి నైపుణ్య కేంద్రాలు అడ‌గ‌డ‌మో చేయ‌డం లేదు. ముఖ్యంగా ఇక్క‌డ స్థానిక ఉత్ప‌త్తుల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు ఉన్నా ఇవ‌న్నీ మ‌న్ కి బాత్ లో విన‌ప‌డ‌తాయి కానీ ఆచ‌ర‌ణలో మాత్రం ఏవీ క‌న‌బ‌డ‌వు.

ఇదీ ద‌క్షిణాది రాష్ట్రాల దౌర్భాగ్యం. గంగాన‌ది ప్ర‌క్షాళ‌న పేరిట పెద్ద స్కాం న‌డిపిన బీజేపీ పెద్ద‌ల‌కు ఇక్క‌డి న‌దులు ఎందుక‌ని గుర్తుకు రావు? ఇక్క‌డి క‌ష్టాలు ఎందుకు తెలియ‌డం లేదు. వ్య‌వ‌సాయ‌మే ఆధారంగా బ‌తికే దేశానికి సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి దేశాభివృద్ధి అన్న‌ది తెలియ‌దా?
ఇంత‌వ‌ర‌కూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు, కేసీఆర్ కు, జ‌గ‌న్ కు ఇలా ఇత‌ర పాల‌కుల‌కు మోడీ చేసిన సాయం ఏమీ లేదు. ముఖ్యంగా తె లుగు రాష్ట్రాల‌కు ఆయ‌న చేసిన సాయం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే అటు త‌మిళ‌నాడు కానీ ఒడిశా కానీ రాజకీయాలు కానీ కాస్త భిన్నంగా ఉన్నా ఆంధ్రా, తెలంగాణాలు మాత్రం త‌మ‌దైన స్నేహాల‌ను కొన‌సాగిస్తున్నాయి. అలా ఉన్న‌ప్ప‌టికీ ద‌క్షిణాది రాష్ట్రా ల‌కు ద‌క్షిణే ఇస్తున్నాడు. క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతున్న కేర‌ళ‌కు ఆయ‌న చేసిన సాయం ఎంతంటే నిండు సున్నా అనే చెప్పాలి. పి న‌ర‌యి విజ‌య‌న్ త‌నదైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు కానీ మోడీ నుంచి సాయం అర్థించడం అన్న‌ది అర్థం లేని ప‌ని అ ని ఆయ‌నో నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అదేవిధంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ కూడా కేంద్రం నుంచి కోరుకుంటున్న‌ది ఏమీ లే దు. ద‌క్షిణాది ప్రాంతాల‌లో ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం అయితే త‌న‌దైన పంథాలో పోతుందే కానీ క‌రోనా నివార‌ణ కోసం కాసులు ఇ వ్వండ‌ని అర్థించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap