2019లో తిరుగులేని మెజారిటీ సాధించిన సీఎం జగన్ ఏకంగా అధికారాన్ని చేపట్టారు. దీంతో మొట్టమొదటిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఏపీ రాజకీయాలు ఊపిసింది అని చెప్పాలి. అయితే జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్ల పాలనలో తీసుకున్న సంచలన నిర్ణయాలు ఎన్నో అని చెప్పాలి. ఇక జగన్ అధికారంలో ఉండడానికి మరో రెండేళ్ళు మిగిలి ఉండగా ఇప్పటి నుంచే అటు ఏపీలో ఎన్నికల వేడి మొదలవుతుంది.



 ఈ క్రమంలోనే ఇటీవల కేబినెట్ మీటింగ్ నిర్వహించిన జగన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా కార్యాచరణకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  అయితే ఇక మూడేళ్ల జగన్ పాలనలో చూసుకుంటే ఎన్నో పథకాలు.  ప్రతి వర్గానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు  ఇక పేద విద్యార్థులు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక స్కూల్ దశనుంచి కాలేజీ వరకు కూడా పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రస్తుతం భారీగానే డబ్బులు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.


 ఇలా ఇప్పటి వరకు జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ సర్కార్ కి వచ్చి పడిన సమస్యల్లా.. కేవలం నిరుద్యోగుల తోనే. ఎందుకంటే అధికారంలోకి రాకముందు ప్రతి ఏడు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించి భారీగా ఉద్యోగాల భర్తీ చేపడతామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి  వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక లక్షా 30 వేల మందికి పైగా ఉద్యోగులు ఇచ్చినప్పటికీ ఉద్యోగాలతో వాలంటీర్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల రెండున్నర సంవత్సరాల తర్వాత జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయగా అది కూడా నిరుద్యోగులను తీవ్ర అసంతృప్తి పరిచింది.  ఇలా జగన్ పథకాలతో ప్రజలు ఆకర్షితులు అయినప్పటికీ నిరుద్యోగులు మాత్రమే పూర్తిస్థాయి వ్యతిరేకతతో ఉన్నారు.  దీంతో  నిరుద్యోగులకు మచ్చిక చేసుకోవడానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: