ఏపీలో ముంద‌స్తు కు వెళ్లేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. దీనికి సంబంధించి.. ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌త రెడీ చేసుకుంది. అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఏం చేస్తుంది? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింద‌నేది వాస్త‌వం. పార్టీలో అధినేత చంద్ర‌బాబు మాట‌కు త‌ప్ప‌.. ఇత‌ర నేత‌ల ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు కానీ... పార్టీలో నెంబ‌ర్ 2గా చ‌లామ‌ణి అవుతున్న లోకేష్‌కు కానీ.. సీనియ‌ర్లు వాల్యూ ఇవ్వ‌డం లేద‌నేది వాస్త‌వం., \

ఇదే విష‌యంపై కొన్నాళ్లుగా పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది. అచ్చెన్నాయుడును ఒక నేత‌గా గుర్తిస్తామే .. త‌ప్ప‌.. పార్టీ అధ్య‌క్షుడుగా ఆయ‌న‌ను గుర్తించే ప‌రిస్థితి లేద‌ని.. గుస‌గుస‌లు పార్టీ సీనియ‌ర్ల నుంచి బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇది.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది. పైగా.. ఇప్ప‌టి వ‌ర‌కు అచ్చెన్న కూడా త‌న‌ను తాను నిరూపించుకునే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌లేక పోయారు. దీంతో ఆయ‌న‌కు ఒక్క త‌న కుటుంబం నుంచి మాత్ర‌మే మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ ఇత‌ర సీనియ‌ర్ల‌ను ఆయ‌న క‌లుపుకొని పోలేక పోతున్నారు. ముఖ్యంగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక స‌మ‌యంలో అచ్చెన్న చేసిన వ్యాఖ్య‌ల దుమారం ఇప్ప‌టికీ స‌మ‌సి పోలేద‌నేది వాస్త‌వం.

ఇక‌, లోకేష్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ‌ధ్య ఆయ‌న దూకుడు చూపించినా.. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తున్నా.. ఆశించిన మేర‌కు ఫ‌లితం రాబ‌ట్టుకోలేక పోతున్నారు. అనుకూల మీడియా ప్ర‌చారం ఒక్క‌టే క‌లిసి వ‌స్తున్న అంశం. కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం లోకేష్‌కు మ‌ద్ద‌తుగా సీనియ‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిపాద‌న‌లు ముందుకు తీసుకురాలేక పోతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ముంద‌స్తు వ‌స్తే.. మ‌ళ్లీ.. చంద్ర‌బాబు న‌డుం బిగించి.. ప్ర‌జ‌ల్లోకి రావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సీనియ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీని వాడుకున్నార‌ని.. పార్టీ కోసం ఏమీ చేయ‌డం లేద‌ని.. అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ ఈ విమ‌ర్శ‌ల‌పై చ‌లించ‌డం లేదు. పైగా.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో ఎంపీ, గుంటూరులో ఎంపీ.. వ‌ర్గాలు.. రెండుగా చీలిపోయాయి. పార్టీ ప‌టిష్ట‌త కోసం దృస్టి పెడుతున్న వారు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయార‌నేది వాస్త‌వం. ఈ స‌మ‌యంలో ముంద‌స్తు.. ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం అంటే.. టీడీపీకి రెండో ప్ర‌పంచ యుద్ధం చేసిన‌ట్టు అవుతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు త‌ప్ప‌.. ఇప్పుడు టీడీపీకి క‌నిపిస్తున్నా బ్రాండ్ ఇమేజ్ మ‌రొక‌టి క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: