జ‌గ‌న్ ప్ర‌భుత్వంకు ముంద‌స్తు జ్వ‌రం ప‌ట్టుకుంది. ఒక‌వేళ 2023లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం  ఎన్నిక‌ల‌కు పోతే కొంప కొల్లేరే! ఇప్ప‌టికే కొన్ని వ‌ర్గాల‌కు దూరంగా ఉంటున్న వైసీపీ, ఆదాయ మార్గాల‌ను వ‌ద్దనుకుంటున్న వైసీపీ ఈ సారి బొక్క బోర్లాప‌డ‌డం ఖాయం.

అదేవిధంగా టీడీపీ శ్రీకాకుళంలో కాస్త పుంజుకుంది. నాయ‌కులంతా స్థానికంగా చేస్తున్న త‌ప్పిదాలే కార‌ణం. కొందరు సీనియ‌ర్లు ఉత్త‌రాంధ్ర రాజకీయాల‌కు గుడ్ బై చెబితే వైసీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మే.పాత‌ప‌ట్నం, టెక్కలి, ఇచ్ఛాపురం, ప‌లాస , ఆమదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గాల క్యాడ‌ర్‌కు టీడీపీ మ‌ళ్లీ త‌న ప్ర‌భావాన్ని అందించ‌నుంది. గ‌త ఉత్సాహంతో వీరు ఇప్ప‌టి నుంచే ప‌నిచేస్తే గెలుపు ఖాయం. అదేవిధంగా విజ‌య‌నగ‌రం, విశాఖ‌ల్లో కూడా టీడీపీ పుంజుకుంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వైసీపీ చేస్తున్న త‌ప్పిదాలే జ‌గ‌న్ కు అవ‌రోధంగా మార‌నున్నాయి అన్న‌ది  నూరు శాతం నిజం. ఇవే వైరి ప‌క్షాల‌కు కలిసొచ్చే అంశాలు కావ‌డం త‌థ్యం.


ముంద‌స్తు ఎన్నిక‌లంటూ హ‌డావుడి మొద‌లయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తి డైలమాలో ప‌డిపోవ‌డం ఖాయం. పథ‌కాల‌నే న‌మ్ముకు న్న ఆయ‌న‌కు అవే కొంప‌ముంచుతాయ‌ని చాలా మంది ప‌రిశీల‌కుల అభిప్రాయం. డ‌బ్బే ప్ర‌ధానం అనుకుని నాలుగు రూపాయ‌లు పంచినంత మాత్రాన ఓట్లు రాలుతాయి అని భావించ‌డంలోనే అర్థం లేద‌ని, అవివేక‌మే ఉంద‌ని చాలా మంది ఆయ‌న‌కు వ‌ద్ద‌ని వారిస్తున్నా ఆయ‌న ఎవ్వ‌రి మాటా విన‌డం లేదు అని తెలుస్తోంది. కానీ ఒక ప‌థ‌కం త‌రువాత ఒక  ప‌థ‌కం అంటూ జ‌గ‌న్ చేస్తున్న హ‌డావుడి కార‌ణంగా ఉన్న సీట్లు కూడా ఆయ‌న కాపాడుకునే స్థితిలో లేరు. రానున్న‌ది ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో ఆయ‌న ఏం  చేసినా ఈ రెండేళ్ల కాలంలోనే! జ‌గ‌న్ మాత్రం సంక్షేమ జ‌పాన్నే ఎందుక‌నో ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అవినీతిని ఆయ‌న అడ్డుకోలేక‌పోతున్నారు. అంతేకాదు రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త అస్స‌లు లేదు. టీడీపీ బ‌ల‌ప‌డ‌డం లేదు అని చెప్ప‌లేం కానీ వైసీపీ ఆ వేగాన్ని అందుకోవ‌డం లేదు అని మాత్రం సుస్ప‌ష్టం.





మరింత సమాచారం తెలుసుకోండి:

ap