ఏపీలో ముంద‌స్తు రాగం ప‌లుకుతోంది. సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని త్వ‌ర‌లోనే ర‌ద్దు చేసుకుని.. ముం ద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. మ‌రో ప‌క్షంగా ఉన్న కీల‌క పార్టీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యా ణ్ నేతృత్వంలోని జ‌న‌సేన ప‌రిస్థితి ఏంటి?  ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే.. ఈపార్టీ ఎలా ముం దుకు వె ళ్తుంది? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు... జ‌న‌సేన అభిమానుల‌ను క‌లచి వేస్తున్నాయి. ఇత‌ర పార్టీల‌కు క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉంది. కొద్దో గొప్పో.. ప్ర‌జ‌ల్లోనూ ఫాలోయింగ్ ఉంది. కానీ, జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఈ త‌ర‌హా క్షేత్ర‌స్థాయిలో ఫాలోయింగ్ క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై ప‌వ‌న్ దృష్టి పెట్ట‌లేదు.

కేవ‌లం బీజేపీతో పొత్తుకు సిద్ధ‌మైన ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకునే విష‌యంలో దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం.. ఇప్పుడు ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం త‌న ఇమేజ్‌తోనే పార్టీని న‌డిపించ‌వ‌చ్చనేది.. ప‌వ‌న్ వ్యూహ‌మే అయినా.. గ‌త ఎన్నిక‌ల్లో ఫ‌లితాల అనంత‌ర‌మై నా.. ఆయ‌న త‌న వ్యూహాన్ని మార్చుకుని ఉంటే బాగుండేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ లం ఒకే ఒక్క స్థానం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. రెండు చోట్ల ప‌వ‌న్ పోటీ చేసినా.. ఓడిపోయా రు. పైగా గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌కు.. మంచి ఫాలోయింగ్ ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. సీట్ల‌లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితిని ఎదుర్కొనాల్సి వ‌చ్చి.. కేవ‌లం 148 స్థానాల్లోనే ప‌వ‌న్ త‌న అభ్య‌ర్థుల‌ను పోటీకి దింపారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రిస్తితి కూడా క‌నిపించ‌డం లేదు. అంటే.. దాదాపు 100 నియోజ‌కవ‌ర్గాల్లో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసేందుకు అభ్య‌ర్తులు కూడా క‌నిపించ‌డం లేదు. గ‌తంలో ఎంతో మంది మేధావులు పార్టీలో ఉండేవారు. కానీ, ఇప్పుడు మేధావులు లేకుండా పోయా రు. ఒక్కొక్క‌రుగా పార్టీకి గుడ్ బై చెప్పారు. పోయిన వారు పోయినా.. ఉన్న‌వారైనా... పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారా? అంటే.. అది కూడా లేదు.

``మేం ఏం చేయాల‌న్నా.. అనేక అడ్డంకులు ఉంటున్నాయి. బీజేపీతో చెలిమి చేసి.. ఏం సాధిస్తాం!`` అని చెప్పుకొంటున్న నాయ‌కుల సంఖ్య జ‌న‌సేన‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో పార్టీలో కీల‌క నేత‌లు.. కూడా చాలా మంది ముభావంగానే ఉంటున్నారు. అధికారాలు అన్ని ఒక్కరి చేతిలో ఉంచార‌నే ది వారి ఆవేద‌న‌. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్ పార్టీ జారుడు మెట్ల‌పై ఆప‌శోపాలు ప‌డుతోంది. కేవ‌లం ప‌వ‌న్ ఇమేజ్‌నే న‌మ్ముకున్నామ‌ని.. అంటున్నా.. గ‌త ఎన్నిక‌ల్లో ఈ ఇమేజ్ ఏమేర‌కు ఫ‌లితాలు ఇచ్చిందో తెలిసిన త‌ర్వాతైనా జాగ్ర‌త్త ప‌డ‌క‌పోవ‌డం.. మ‌రీ దారుణం అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. ఎలా చూసుకున్నా.. ముంద‌స్తు వ‌స్తే.. జ‌నసేన నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: