భార‌త ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ 71 వ పుట్టిన రోజు సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తమ నాయ‌కుడి జ‌న్మ‌దినాన్ని వేడుక‌గా జ‌రుపుకుంటున్నారు క‌మ‌ళం పార్టీ నాయ‌కులు. కానీ న‌రేంద్ర మోడి బ‌ర్త్ డే ను అక్క‌డ `బ్లాక్ డే` గా నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి పీఎం మాకు వ‌ద్దంటూ మోడిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సాగు చ‌ట్టాలు ఏర్ప‌డి సంవ‌త్స‌రం కావ‌స్తున్న నేప‌థ్యంలో న‌రేంద్ర‌మోడీ పుట్టిన రోజు అయిన సెప్టెంబ‌ర్ 17 వ తేదిని బ్లాక్ డే గా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని పంజాబ్‌కు చెందిన శిరోమ‌ణి అకాళీ ద‌ల్ ( సాద్ ) పార్టి బుధ‌వారం వెల్ల‌డించింది.


   ఈ సంద‌ర్భంగా మోడి పుట్టిన రోజు అయిన నేడు `బ్లాక్ ఫ్రైడే ప్రొటెస్ట్ మార్చ్` అనే పేరుతో ఢిల్లిలో ఉన్న గురుద్వారా సాహిబ్ గంజ్ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు నిర‌స‌న ర్యాలీ చేప‌డుతామ‌ని సాద్ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ ప్ర‌క‌టించారు.  నిజానికి ఇదే రోజు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ జ‌న‌మ్దినం కావ‌డం గ‌మ‌నార్హ‌మైన విష‌యం. అలాగే ఈ రోజును `జాతీయ నిరుద్యోగుల దినోత్స‌వంగా` కొంత మంది * జ‌రుపుకుంటూ మోడీ సృష్టిస్తున్న నిరుద్యోగం గురించి ప్ర‌స్తావిస్తున్నారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది.


   ఈ నేప‌థ్యంలో శిరోమ‌ణి అకాలీ ద‌ళ్ ( సాద్ )  పార్టీ కూడా ` బ్లాక్ డే ` నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం.   కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకిస్తూ మోడీ కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్ఆరు శిరోమ‌ణి అకాలీ ద‌ళ్ (సాద్ ) నేత హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాదల్ కూడా ఈ బ్లాక్ డే మార్ఛ్ ఫాస్ట్ నిర‌స‌న‌లో పాల్గొంటున్నారు. అలాగే ఈ నిర‌స‌న‌లో ఆ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నేత‌లు పెద్ద ఎత్తున పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: