టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి పై వైసీపీ ఎమ్మెల్యే దాడికి దిగడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం సంచలనం అయింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు చేరుకున్నారు. అటు టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష‌ నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాల‌ని పంపావంటేనే, తాడేప‌ల్లి కొంప‌లో ఎంతగా వ‌ణికి ఛస్తున్నావో అర్థం అవుతోంది అంటూ నారా లోకేష్ కామెంట్స్ చేసారు.

ఇంత‌కంటే నువ్వు దిగ‌జార‌వ‌ని అనుకున్నప్ర‌తీసారీ అధఃపాతాళంలోకి దిగ‌జారుతూనే వున్నావు అంటూ సినిమా డైలాగ్ వాడారు. నీ తాడేప‌ల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూర‌మో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ వ‌చ్చే రోజు కూడా ఎంతో దూరంలేకుండా నువ్వే తెచ్చుకుంటున్నావు అని విమర్శలు చేసారు. నీ గాలి హామీలు తేలిపోయాయి అని లోకేష్ అన్నారు. నీ ముద్దులు పిడిగుద్దుల్లా ప‌డుతున్నాయి అన్నారు ఆయన. జ‌గ‌న్ ది అంతా నాట‌కమ‌నీ జ‌నానికి తెలిసిపోయింది అని పేర్కొన్నారు.

 జ‌నం తిర‌గ‌బ‌డే రోజు ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని, ఉలిక్కిప‌డి ప్ర‌తిప‌క్షం పైకి వాళ్ల‌నీ, వీళ్ల‌నీ పంప‌డం ఎందుకు? నువ్వే ఓ సారి వ‌చ్చిపోకూడ‌దు అంటూ సూచించారు. మా పెద్దాయ‌న నీలాంటి క్రూర‌, నేర‌స్వ‌భావం ఉన్నోడు కాదు అన్నారు. నువ్వు ముంచేయాల‌ని నిత్యం త‌పించే క‌ర‌క‌ట్ట ప‌క్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి..బొత్తిగా నీకు తెలియ‌ని అభివృద్ధి అంటే ఏంటి? కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఎలా తీసుకురావాలి? అని  ఉపాధి-ఉద్యోగావ‌కాశాలు ఎలా పెంపొందించాలి? అనే అంశాలు చ‌క్క‌గా వివ‌రిస్తారు అన్నారు.  కాదూ-కూడ‌దు ఇలాగే బ్లేడ్ బ్లాచ్‌ ల‌ను వేసుకొచ్చేస్తానంటే, నీ స‌ర‌దాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కళ్ళకి వడ్డీతో సహా వడ్డిస్తాం అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: