చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య కేసులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు అని తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేసారు. 8.05 నిమిషాలకు కొనార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆయన తెలిపారు. ట్రైన్ ను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్స్ ప్రత్యక్షంగా చూసి ఫిర్యాదు చేశారు అని ఆయన పేర్కొన్నారు. రాజు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కడ ఉన్న కొంత మంది రైతులు కళ్లారా చూశారు అని అన్నారు. ఉదయం విధులకు వెళుతున్న వారు కూడా రాజు ను గుర్తు పట్టి ప్రశ్నిస్తుండగా అక్కడ నుండి పారిపోయాడు అని వారు వివరించారు.

రాజు ఆత్మహత్య కేసులో 7 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. వారి చెప్పిన విషయాలు అన్ని కూడా వీడియో గ్రఫీ చేశాము అని పేర్కొన్నారు. కాగా నిన్న చిన్నారి ఘటనలో ప్రధాన నిందితుడు అయిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అతన్ని చంపేశారు అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రాజుపై పది లక్షల రివార్డ్ కూడా తెలంగాణా పోలీసులు ప్రకటించిన సంగతి విదితమే.

అయితే రాజు దొరకకపోవడం నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకోవడం ప్రకంపనలు సృష్టించింది. రాజు విషయంలో పోలీసుల మీద కేసు నమోదు చేయాలని కూడా కోరుతున్నారు. పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి మీరు ఎవరిని అయినా సరే ప్రశ్నించండి అంటూ సవాల్ చేస్తున్నారు. చిన్నారిని హత్య చేసిన తర్వాత రాజు దాదాపు వారం రోజుల పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. ఎక్కడ ఉన్నాడు ఏంటీ అనే కనీస సమాచారం కూడా పోలీసులకు దొరకలేదు. చివరకు అతనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: