టీటీడీ క‌మిటీల ఏర్పాటులో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌న్న‌ది రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ ఆరోప‌ణ‌. ఈ ఆరోప‌ణ‌లు ఎలా ఉ న్నా తాను మ‌ళ్లీ న్యాయ‌పోరాటానికి సిద్ధం అయిపోతున్నారు.ఏడు కొండ‌ల‌వాడి ప‌విత్ర‌త‌కు భంగం వాటిల్లితే స‌హించ‌న‌ని, తాను మోడీ మాదిరిగానే ధర్మం కోసం ప‌నిచేస్తాన‌ని చెప్ప‌డం వెనుక అస‌లు ఉద్దేశం వైసీపీని కోర్టు బోనులో ఉంచేందుకే అన్న‌ది సుస్ప ష్టం.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా ముందుగా ఆ ఎంపీ స్పందిస్తారు. వీలుంటే తిరుప‌తి విష‌య‌మై స్పందిస్తారు. ఇంకా వీలుంటే ప్ర‌కాశం జిల్లా ఫ్లోరైడ్ పై కూడా మాట్లాడ‌తారు. అస‌లు త‌న ప‌రిధిలో ఉన్నా లేకున్నా ఆయ‌న మాట్లాడ‌డం మొద‌లుపెట్టాక వైసీపీకి ముచ్చెమ‌ట‌లు పోయ‌డం ఖాయం. ముఖ్యంగా ఆయ‌న సాయిరెడ్డిని టార్గెట్ చేసి చాలా విష‌యాలు ఇప్ప‌టికే చెప్పారు. జ‌గ‌న్ ను అస్స‌లు లెక్క‌చేయ‌కుండా కొన్ని మాట‌లు చ‌ట్టాల‌ను ఎలా త‌ప్పుదోవ  ప‌ట్టిస్తున్నార‌న్న‌దీ చెప్పారు.
ఇవేవీ ప్ర‌జ‌లు వినిపించుకోరు కానీ వీటిని శ్ర‌ద్ధ పెట్టి వింటే రాష్ట్ర ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి త‌ప్పిదం వెనుక ఉన్న ఆర్థిక నేరం ఏంట‌న్న‌ది త‌ప్ప‌క అర్థం అవుతోంది. అలా అని అవేవో గాలి మాట‌లు అని అన‌డానికీ లేదు. ఆయ‌న కూడా న్యాయ నిపుణుల‌తో మాట్లాడే, మీడియాకు వివ‌వ‌రాలు ఇస్తున్నారు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అన్న‌వి పాల‌క మండ‌లి ఏర్పాటు అన్న‌ది పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింద‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం.
ఈ ద‌శ‌లో ఆయ‌నేమ‌న్నారంటే.. : టీడీపీ కూడా ఇంత‌గా ప‌నిచేయ‌డం లేదు కానీ న‌ర‌సాపురం దేశ రాజ‌ధానిలో ఉంటూ కూడా ఎన్నో మాట‌లు చెబుతున్నారు. తా జాగా టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యులు, ప్ర‌త్యేక ఆహ్వానితుల పేర్లు ఖ‌రారు చేయ‌డంతో ఆర్ఆర్ఆర్ దృష్టి అటు మ‌ళ్లింది. 18 మంది త‌క్కువ‌గా ఉన్న కురు స‌భ‌లా ఉంద‌ని అని చెబుతూ, టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాల‌పై త్వ‌ర‌లోనే కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని  చెబుతు న్నారు. టీటీడీ ప‌విత్ర‌త‌ను చెడ‌గొడుతున్నార‌ని ఆరోపిస్తూ, దీనిపై త‌న‌లో భ‌యాందోళ‌న‌లు ఉన్నాయ‌ని అంటున్నారు. త‌న‌లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల కార‌ణంగానే త్వ‌ర‌లోనే న్యాయ‌పోరాటానికి సిద్ధం అవుతున్నాన‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap