ఉత్త‌ర్ ప్ర‌దేశ్ యోగి రాష్ట్రంగానే జ‌నాల నోర్ల‌లో తిరుగుతుందంటే అక్క‌డ బీజేపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో వైపు యోగికి దేశ వ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు. అయితే గ‌త కొన్నేళ్లుగా ఉత్త‌ర  ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీనం ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ మొత్తం ఉత్త‌ర ప్ర‌దేశ్ పైనే పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎలాగైనా యోగి రాష్ట్రంలో కాంగ్రెస్ జండాను ఎగ‌ర‌వేయాల‌ని అదిష్టానం నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఏకంగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ త‌ర‌పున సీఎం కాండిడేట్ గా అధిష్టానం ప్రియాంక గాంధీని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ యువ‌త అంతా బీజేపీ వైపే ఉంటారు. 

కానీ ముస‌లి వాళ్ల‌లో మ‌ధ్య వ‌య‌స్సు గ‌ల వారిలో కాంగ్రెస్ అంటే కాస్త అభిమానం ఉంటుంద‌ట‌. దాంతో ఈ సారి యువ‌నేత ప్రియాంక గాంధీని ఉత్త‌ర ప్రదేశ్ లో రంగంలోకి దింపితే యువ‌త‌ను కూడా కాంగ్రెస్ ఆక‌ర్షించే అవ‌కాశం ఉంద‌ని అధిష్టానం భావిస్తోంద‌ట‌. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో బీజేపీ మ‌రియు బీఎస్పీ ల మ‌ధ్య‌నే గ‌ట్టి పోటీ క‌నిపిస్తోంది. అయితే ఇప్పుడు అక్క‌డ కాంగ్రెస్ కూడా త‌న బ‌లాన్ని పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇక గ‌తంలో కూడా ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు జ‌రిగిన సమయంలో ప్రియాంక గాంధీ ప‌ర్య‌టించి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దాంతో ఉత్త‌ర ప్రదేశ్ ప్ర‌జ‌ల‌తో ప్రియాంక గాంధీకి మంచి సంబంధాలు ఉండ‌ట‌మే కాకుండా యూపీపై ప్రియాంక కు కూడా ఎంతో అవ‌గాహ‌న ఉంది.

యితే గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రియాంక ప‌ర్య‌టించినా ఆ ఎన్నిక‌ల్లో సత్ఫ‌లితాలు మాత్రం క‌నిపించ‌లేదు. దాంతో ఇప్పుడు ప్రియాంక ఉత్త‌ర ప్ర‌దేశ్ లో రంగంలోకి దిగితే చాలానే గ్రౌండ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ వైపు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ సారి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని దీమాతో ఉన్నారు. దాంతో యూపీపై కూడా ఆయ‌న వ్యూహాలు ర‌చించే అవ‌కాశం ఉంది. మరి యోగి పై ప్ర‌శాంత్ వ్యూహాలు..ప్రియాంక దూకుడు ప‌నిచేస్తాయో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: