సైదాబాద్ హత్యాచారం కేసు నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని హైకోర్టు అదేశించింది. వరంగల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. విచారణ జరిపి నాలుగు వారాల్లోగా సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజుది ఆత్మహత్యేనని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రేపు రాత్రి 8గంటల్లోగా పోస్ట్ మార్టం వీడియోను జిల్లా జడ్జికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

రేపిస్టు రాజును పోలీసులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందే చంపేసి.. ఆ తర్వాత రైలు పట్టాలపై పడేసి ఉంటారని వారు అన్నారు. రాజు చేసింది తప్పేననీ.. అయితే ఆత్మహత్య చేసుకొని ఉండడని తెలిపారు. రాజు రేప్ చేశాడంటే తాము నమ్మేవాళ్లం కాదనీ.. చిన్న మృతదేహం రాజు ఇంట్లో దొరికినందుకే నమ్ముతున్నామని చెప్పారు.

తన భర్తను పోలీసులే చంపేసుంటారని నిందితుడు రాజు భార్య మౌనిక అనుమానం వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. తమను పోలీస్ స్టేషన్ లో 10రోజులు ఉంచారనీ..ఒకసారి దొరికాడని చెప్పారు.. ఇంకోసారి దొరకలేదన్నారు.. తెల్ల పేపర్ పై సంతకాలు కూడా పెట్టించుకున్నట్టు రాజు భార్య తెలిపింది. ఎందుకని అడిగితే ఊరికే అని చెప్పారని చెప్పింది. పోలీసులే చంపేశారు అనుకుంటున్నా అని అభిప్రాయపడింది.

ఇక ట్రాక్ మాన్ చెబుతున్న విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజు ఆత్మహత్యకు ముందు తమకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని నస్కర్ రైల్వే ట్రాక్ మెన్ కుమార్ తెలిపారు. తమను చూసి అతను పొదల్లోకి వెళ్లిపోవడంతో ఎవరో అనుకున్నామన్నారు. తాము కొద్దిదూరం వెళ్లిన తర్వాత 8గంటల 40నిమిషాల సమయంలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఓ వ్యక్తి చనిపోయాడని రైతులు చెప్పినట్టు కుమార్ చెప్పారు. దీంతో తాము రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజుగా నిర్ధారించినట్టు చెప్పారు.














మరింత సమాచారం తెలుసుకోండి: