తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలపడటానికి ఉన్న అన్ని అవకాశాలను విజయవంతంగా వాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టేందుకు స్పీడ్ గా పావులు కదుపుతుంది. ఉద్యమ స్పూర్తిని మరోసారి తెలంగాణా ప్రజలల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. తాజాగా నిర్మల్ లో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేడు అమిత్ షా మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం వచ్చిన  13 నెలల తర్వాత తెలంగాణ స్వాతంత్య్రం వచ్చింది అని అన్నారు.

  2023 లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేసిన ఆయన... ఆ వెంటనే విమోచన దినోత్సవం నిర్వహిస్తాం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. మజ్లిస్ పార్టీకి బీజేపీ పి భయపడటం లేదు అని అమిత్ షా స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కి ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక లో విమోచన దినోత్సవం ను అధికారికంగా నిర్వహిస్తున్నారు... నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటూ నిలదీశారు. కేసీఆర్ నీకు వేయి మంది ఆదివాసుల బలిదానం గుర్తు కు రావడం లేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

సంజయ్ సంగ్రామ్ యాత్ర కు ప్రజలు  స్వాగతిస్తున్నారు అన్నారు అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లోని  మొత్తం లోక సభ సీట్లను మోడీకి కానుక గా ఇస్తాం అని అమిత్ షా పేర్కొన్నారు.  కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా దెబ్బతింది అని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అవకాశం లేదు అని అన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది అని ఆయన ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అన్నారు ఆయన. హుజురాబాద్ లో రాజేందర్ గెలుపు ఖాయం అని అన్నారు. ప్రజలు పైసలకు ఓటేస్తారా...పని చేసే వాళ్లకు వేస్తారో తేల్చుకోండి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts