తెలంగాణలో రాజకీయాన్ని స్పీడ్ గా చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేడు నిర్మల్ లో బహిరంగ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభ విషయంలో రాష్ట్ర బిజెపి నేతలు అందరూ పట్టుదలగా వ్యవహరించారు. ఈ బహిరంగ సభకు సంబంధించి దాదాపుగా పది రోజుల నుంచి కష్టపడుతూ వచ్చారు. ఇక అమిత్ షా నేడు రావడంతో విమోచన దినం కు సంబంధించి ఏ ప్రకటన వస్తుంది ఏంటీ అనేది అర్ధం కాలేదు. బండి సంజయ్ ఈ సభలో కాస్త దూకుడుగా విమర్శలు చేసారు. అలాగే అమిత్ షా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసారు.

ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ఎవరికి భయపడేది లేదు అని స్పష్టం చేసారు. అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తాం అన్నారు.  తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలి అని ఆయన సవాల్ చేసారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలి అని అన్నారు. తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారు అని ఎందుకు నిర్వహిస్తలేరో కేసీఆర్ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఇలాంటి మూర్కుడు దేశ ప్రధాని అయితే స్వాతంత్ర్య దినోత్సవం తేదీ కూడా మారుస్తాడు అన్నారు.

రాష్ట్రంలో అధికారంలో కి వస్తాం, నీ చరిత్ర ను భూ స్థాపితం చేస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ నీచ చరిత్ర ను కూడా పాఠ్యంశంలో చేరుస్తాం అన్నారు ఆయన. గోల్కొండ ఖిల్లా పై కాషాయ జెండా ఎగుర వేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ  రాష్ట్రం మూర్ఖుడి చేతిలో బందీ అయింది అని ఆయన ఆరోపణలు చేసారు.  తెలంగాణ తల్లి రోదిస్తోంది అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు అందరూ హాజరు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: