ఏపీ సీఎం  జగన్ మోహన్‌ రెడ్డి వైపు  కన్నెత్తి చూసినా నారా లోకేష్ తాట తీస్తామని హెచ్చరించారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.  ఒక అడుగు వేస్తే తాటి మట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని... ఇది ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.  అయ్యన్న పాత్రుడు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని... ఇటు వంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడా ? అని నిప్పులు చెరిగారు జోగి రమేష్‌. నారా  చంద్రబాబు కు నిరసన చెప్పటానికి వెళితే నా పై దాడి చేశారని.... చంద్రబాబు నోటిని ఫినాయిల్ తో కడగాలని మండి పడ్డారు ఎమ్మెల్యే జోగి రమేష్.  

పద్ధతి మార్చు కోకపోతే చంద్రబాబు ను రాష్ట్రంలో తిరుగనివ్వమని హెచ్చరించారు ఎమ్మెల్యే జోగి రమేష్.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా దాడులకు పాల్పడుతోందని... ఎంపీ నందిగం సురేష్ ఫైర్‌ అయ్యారు.   ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నిద్ర పట్టదని... అధికారం లేకపోతే తండ్రి, కొడుకులు ఈ రాష్ట్రంలో ఉండరని నిప్పులు చెరిగారు.  70 ఏళ్ళ వయసులో చంద్రబాబు మనవళ్లతో ప్రశాంతంగా ఆడు కోకుండా కుట్రలు పన్నుతున్నారని నిప్పులు చెరిగారు.  కట్ట మీద కి తొడలు కొట్టిన వారూ వచ్చారని మండి పడ్డారు.

ఆ రోజు కోడెల హాస్పిటల్ లో ఉంటే పరామర్శించటానికి కూడా వెళ్ళని చంద్రబాబు ఇవాళ నాటకాలు ఆడుతున్నారని..ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అన్నాడు.  చంద్రబాబు కు అసలు ఈ రాష్ట్రంలో అడ్రెస్సే లేదని...  జోగి రమేష్ కు ప్రాణాపాయం జరిగి ఉంటే బాధ్యులు ఎవరు ? అని ప్రశ్నించారు.  ఈ మొత్తం ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని... జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమి తప్పదని తెలిసి డైవర్ట్ చేయటానికే ఈ వ్యాఖ్యలు చేశారని నిప్పులు చెరిగారు.  హోమ్ మంత్రి ఒక మహిళ అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారని... టీడీపీ రాష్ట్రంలో భూస్థాపితం కానుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: