దీనుల‌ను ఆదుకుంటే ధ‌ర్మం కాపాడిన వారు అవుతారు స‌ర్.. మీరు కావాలి.. దేశం కోసం నేను అని ఉప‌న్యాసాలు వ‌ద్దు కానీ ధ‌ర్మం కోసం మీరు ఏం చేస్తారో అది చెప్పండి చాలు.


మోడీ కి ఓ ప్ర‌తిపాద‌న అంతా క‌లిపి పంపండి. క‌రోనా చావుల‌కు ప‌రిహారాలు ఇవ్వ‌మ‌ని అడ‌గండి. రాష్ట్రాలు ఎలానూ అడ‌గ‌వు కనీసం మ‌నం అయినా అడ‌గాలి క‌దా! అడుగుదాం రండి! అదేవిధంగా చిన్నారుల‌కు సాయం అందించ‌మ‌ని చెప్పండి. త‌ల్లీ తండ్రీ లేని చిన్నారుల‌కు  ప్ర‌భుత్వం అండ‌గా ఉండ‌క‌పోతే వాళ్లేమౌతార‌ని?



పుట్టిన్రోజు పండుగ రోజు మోడీకి.ఓ ఛాయ్ వాలా ఇంత‌టి స్థాయికి రావ‌డమే పెద్ద ఎఛీవ్ మెంట్ అన్న‌ది అంద‌రి మాట‌. అంద‌రి మాట కాక‌పోయినా బీజేపీ మాట‌. ఆయ‌న పుట్టిన్రోజున కొన్ని మంచి ప‌నులు చేయాల‌ని బీజేపీ లీడ‌ర్లు భావించారు. ఇదే వేడుక‌ను త‌మ కు అనుగుణంగా మార్చుకున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. నిరుద్యోగ యువ‌త‌కు ఓ దారి చూప‌ని మోడీ ఎలా పండుగ‌లు చేసుకుం టార‌న్న‌ది కాంగ్రెస్ ప్ర‌శ్న‌. నిరుద్యోగ స‌మ‌స్య‌లు అన్నీ త‌రిమికొడ‌తామ‌ని, దేశ యువ‌త‌కు ఉపాధి ఇస్తామ‌ని చెప్పిన మోడీ మాట త‌ప్పార‌ని మండిపడింది.


అదేవిధంగా ఈ రోజు జిల్లా కేంద్రాల్లోనూ నిర‌స‌న‌లు తెలిపింది. సామాజిక మాధ్య‌మా్లోనూ ప్ర‌శ్నించింది. మరోవైపు మోడీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బీజేపీ ప్ర‌భుత్వం రెండు కోట్ల డోసుల టీకాలు అందించేందుకు సిద్ధ‌మైంది. ఇవ‌న్నీ ఇలా ఉండ గా క‌రోనా వేళ అనాథ‌ల‌యిన చిన్నారుల‌ను ఆదుకోవాల‌న్న డిమాండ్ ఒక‌టి వినిపిస్తోంది. క‌రోనా కార‌ణంగా త‌ల్లీతండ్రీ కోల్పోయిన బిడ్డ‌ల‌కు ఇప్ప‌టిదాకా రెండు వేలు ఇచ్చేవారు. ఇటీవ‌ల నిర్ణ‌యంతో ఆ మొత్తాన్ని నాలుగు వేల‌కు పెంచారు. అయినా స‌రే! వారి బా ధ్య‌త‌ను కేంద్రం తీసుకోవాల‌ని రాష్ట్రాలు కొన్ని ప‌ది ల‌క్ష‌ల చొప్పున ఇచ్చాయ‌ని, కేంద్రం కూడా అంతే మొత్తంలో బాధిత పిల్ల‌ల త‌ర ఫున డిపాజిట్ చేయాల‌ని కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

pm