భాష‌కు అదుపు ఉండ‌దు. ఏం మాట్లాడాలో తెలియ‌కుండానే అట‌వీ శాఖ‌ను నిర్వ‌హించారా ఆయ‌న‌. మ‌రీ! ఘోరం! తెలుసు మంత్రులంతా మీ క‌న్నా చిన్న‌వారు. ముఖ్య‌మంత్రి కూడా మీ క‌న్నా చిన్న‌వారు కానీ అంత మాత్రం చేత వారిని కించ‌ప‌రిచి మాట్లాడాల్సిన ప‌ని లేదు. మీరు విప‌క్షంలో ఉన్నా స్వ‌ప‌క్షంలో ఉన్నా ఈ త‌ర‌హా భాష మాట్లాడితే కేసులు త‌ప్ప‌క న‌మోదు అవుతాయి. కానీ మీ అదృష్టం ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వం ఆ ప‌ని చేయ‌లేదు. అంటే పొలిటిక‌ల్ మైలేజ్ ను జ‌గ‌న్ వ‌ద్ద‌నుకుం టున్నారా? లేదా మానవ‌త్వంతో పెద్ద మ‌న‌సుతో మిమ్మ‌ల్ని క్ష‌మించి వ‌దిలేస్తున్నారా?


అయ్య‌న్న వీడియోను ఐదు నిమిషాలు చూడ‌లేం. అంత ఘోరంగా ఉంది ఆయ‌న భాష‌. ఇదే భాష ఇంత‌టి స్థాయిని మించిన భాష నాయ‌కులు గ‌తంలో వాడారు క‌నుక తామూ వాడుతున్నామ‌ని అయ్య‌న్న అంటే ఏం చేయ‌లేం. ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తుల‌ను అలా తిట్ట‌డం ఎంత మాత్రం ఒప్పుకోద‌గ్గ ప‌రిణామం కాదు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇంటిపై జోగి ర‌మేశ్ అనే ఎమ్మెల్యే ఎలా ద‌గ్గ‌రుండి దాడి చేయిస్తార‌ని? ఇది కూడా త‌ప్పే! అయినా త‌ప్పొప్పులు ప్ర‌జ‌లు క‌దా నిర్ణ‌యించాలి. అవును! వాళ్లే నిర్ణ‌యించాలి. ఎన్నిక‌లు వ‌చ్చేదాకా ఫ‌లితాలు తేలేదాకా త‌ప్పొప్పులు అన్న‌వి తేల‌వులేండి. గ‌తంలో కోడెల విష‌య‌మై ఇలానే  జ‌రిగింది. రేపు అయ్య‌న్న విష‌య‌మై కూడా ఇలానే జ‌ర‌గ‌బోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ



ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన, చేస్తున్న అయ్య‌న్న‌పై అస్స‌లెందుకు చ‌ర్య‌లు లేవు? అరెస్టు దాకా ఎందుకు ఈ కేసును తీసుకుని వెళ్లడం లేదు. స్థానిక పోలీసు స్టేష‌న్ల‌లో అయినా వైసీపీ నాయ‌కులు ఫిర్యాదు చేయాలి క‌దా! ఎందు క‌నో ఆ ప‌నే పెట్టుకోలేదు వైసీపీ. జ‌గ‌న్ రాష్ట్రానికి మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా అన్న‌ది అటుంచితే ఆయ‌న వ్యాఖ్య‌లు విన్న వారికి ఎవ‌రికైనా కోపం త‌ప్ప‌క వ‌స్తుంది. రాయ‌లేని భాష‌లో ఆయ‌న జ‌గ‌న్ ను ఇతర మంత్రుల‌ను తిట్టారు. అయితే ఇదే ప‌ద్ధ‌తిలో గ‌తంలో కొడాలి నాని కూడా టీడీపీ నేత‌లను తిట్టారు. అంటే తిట్టుకు తిట్టు చెల్లు అని అనుకుంటున్నారా? తిట్టే ప‌ద్ధ‌తిలో తెలంగా ణను అనుస‌రిస్తున్నారా అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ఏం చెబుదామ‌ని ప్ర‌జ‌ల‌కు.. అంత రాయ‌నివ్వ‌ని భాష‌లో తిట్టి మీరు ఏం సా ధిస్తార‌ని? కొడాలి నాని భాష అయినా అయ్య‌న్న భాష అయినా అదుపులోనే ఉండాలి. ఉండ‌కుంటే పోలీసులు స్వ‌తంత్రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి. ప‌బ్లిక్ గా అంత పచ్చిగా తిడుతుంటే క‌నీసం ఒక్క కేసు కూడా అయ్య‌న్న‌పై న‌మోదు చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో పో లీసులు ఉన్నారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap-