విధేయుల‌యిన‌ప్ప‌టికీ ప‌ద‌వులు వ‌దులుకోవాల్సిందే అని ఓ నియ‌మం జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నియమం కార‌ణంగానో నిబంధ‌న కార‌ణంగానో ఇద్ద‌రు పెద్ద పెద్ద నాయ‌కులు ప‌ద‌వులు వ‌దులుకోవాల్సి వ‌స్తోంది. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌కు ప్రాతిని ధ్యం వ‌హిస్తున్నవారే! ఒక షెడ్యూల్ కులాల నుంచి మ‌రొక‌రు వెనుక‌బ‌డిన సామాజిక వ‌ర్గాల నుంచి ఎన్నికై ప్ర‌జాభిమానం అం దుకున్న వారే ! ఒక‌రి  కులంపై ఇప్ప‌టికే కొన్నివివాదాలు ఉన్నాయి. వీటిని కోర్టులు ప‌రిష్క‌రిస్తాయో లేదో కానీ అస‌లు వివాదం ఇప్పుడు ప‌ద‌వీ త్యాగం అన్న‌ది వీరికి త‌ప్ప‌ని స‌రి! కావడమే!

డిప్యూటీ సీఎంలు ఇద్ద‌రికీ ప‌ద‌వీ గండం త‌ప్ప‌ద‌నే తెలుస్తోంది. ధ‌ర్మాన దాస‌న్న‌కు ఎలానూ ఈ సారి క్యాబినెట్ లో బెర్తు లేద‌నే స మాచారం. ఆయ‌న స్థానంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప‌గ్గాలు అందుకోనున్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్ లేనే లేదు క‌నుక ఈ సారి దాస‌న్న‌కు ఇంటి బాటే త‌ప్ప‌దు. అదేవిధంగా శ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లోనే కాదు రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్న సీనియ‌ర్ లీడ‌ర్  ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సేవ‌ల‌ను ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణాన వాడుకునేందుకు మరింత అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌రింత ప్ర‌భావితం చేసే నాయ‌కుల సేవ‌ల‌ను పార్టీకి వినియోగించుకున్న తృప్తి కూడా జ‌గ‌న్ కు మిగులుతుంది.


ఎలానూ సీనియ‌ర్ల‌ను జ‌గ‌న్ గౌర‌వించ‌రు అన్న అప‌వాదు కూ డా తొల‌గిపోతుంది. ఆ విధంగా యువ ముఖ్య‌మంత్రి త‌న‌పై ఉన్న నింద‌ను తొల‌గించుకుని నిజం ఏంట‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు వివ‌రించేం దుకు ఓ ప్ర‌య‌త్నం ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు మంత్రి ప‌ద‌విని అప్ప‌గించడం. ఇదే సమ‌యంలో కృష్ణ‌దాసు ఓ ష‌ర‌తు కూడా విధించేందుకు అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీచేయ‌న‌ని త‌న స్థానంలో కొడుకు కృష్ణ చైత‌న్య‌కు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగేందుకు  ఆస్కారం ఉంది. దీనిపై ఇప్ప‌టికే జ‌గ‌న్ నుంచి ఓ స్ప‌ష్ట‌మ‌యిన హామీ పొంది ఉన్నారు. కానీ మ‌రోసారి ఇదే విష‌య మై జ‌గ‌న్ తో మాట్లాడ‌నున్నారాయ‌న‌. ఇక మ‌రో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి. ఈమె కూడా పార్టీకి వీర విధేయురాలే.


పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అతి చిన్న‌వ‌య‌సులోనే ఎమ్మెల్యే అయి, అధిష్టానం త‌న‌కు అప్ప‌గించిన ప్ర‌తి ప‌నినీ ఎంతో బా ధ్య‌తాయుతంగా నిర్వ‌ర్తించి, తాను ఎమ్మెల్యేగా ఎన్నిక‌యిన అత్త‌వారి ఊరు కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు ఆంధ్రావ‌ని అం త‌టా మంచి అభిమానుల‌ను సంపాదించుకున్నారామె. కానీ ఈ సారి విస్త‌ర‌ణ‌లో ఆమె పేరుకు స్థానంలేదు అని తేలిపోయింది. ఇక ఈమె మామ శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ రాజు రాజ‌కీయాల నుంచి త‌ప్పు కోనున్నార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap