తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్న కాకినాడ మేయర్ పీఠాన్ని అధికార వైసీపీ తన్నుకుపోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిచోటా తమ హవానే ఉండాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టి‌డి‌పి హ్యాండ్‌లో ఉన్న కాకినాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

టి‌డి‌పికి చెందిన పలువురు కార్పొరేటర్లని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. వారి సపోర్ట్‌తోనే రెండో మేయర్‌ని వైసీపీనే గెలుచుకుంది. ఇక ఆ తర్వాత నుంచి మేయర్ పీఠం కూడా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 33 మంది కార్పొరేటర్ల చేత....టి‌డి‌పికి చెందిన  కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పావనిపై అవిశ్వాస తీర్మానం పెట్టించారు.

ఇక అవిశ్వాస తీర్మానంలో పావని ఓడిపోవడం ఖాయమే...అలాగే మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకోవడం లాంఛనమే. అయితే ఇలా తమ చేతుల్లో ఉన్న మేయర్ పీఠాన్ని కూడా టి‌డి‌పి కాపాడుకోలేకపోయింది. అసలు టి‌డి‌పి అధిష్టానం ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. మంచి మెజారిటీతో ఉన్నా కూడా మేయర్ పీఠం చేజారేలా చేసుకున్నారు. ఇది కేవ‌లం టీడీపీ నేత‌ల మ‌ధ్య ఉన్న గొడ‌వ‌, అంత‌ర్గ‌త విబేధాల వ‌ల్లే అని చెప్పాలి.

అసలు మెజారిటీ డివిజన్లు గెలుచుకుని నాలుగేళ్ల పాటు కాకినాడ మేయర్ పీఠంలో ఉన్న టి‌డి‌పి...ఇప్పుడు హఠాత్తుగా గద్దె దిగే పరిస్తితి వచ్చింది. టి‌డి‌పి తరుపున గెలిచిన కొందరు కార్పొరేటర్లు ప్లేటు ఫిరాయించడంతో ఇప్పుడు మేయర్ పీఠం వైసీపీ వశం కానుంది. 33 కార్పొరేటర్లు వైసీపీకి మద్ధతు ఉండటంతో తేలికగా మేయర్ పీఠాన్ని దక్కించుకొనున్నారు. అయితే మరో సంవత్సరమే కాకినాడ మేయర్ పదవీకాలం ఉంది. అంటే మరో ఏడాది తర్వాత కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నిక జరగనుంది. మరి ఈలోపే మేయర్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ వ్యూహాలు పన్ని సక్సెస్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: