దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో వంట గ్యాస్ ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు 300-400 మధ్య వున్న వంట గ్యాస్ ధరలు ఇపుడు 800-900 మధ్యకు పెరిగాయి. ఇవి ఒక సామాన్యుడికి ఎంత భారమన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఓ వైపు  పెట్రోల్, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటే, మరోపక్క ఎల్‌పీజీ గ్యాస్ ధరల పెరుగుదల సామాన్యుడికి నెత్తిపై పిడుగులా మారుతున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాక తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్టోబర్‌ నెలలో గ్యాస్‌ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.  ఏకంగా 57 - 70 శాతం వరకు గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చెల్లించిన గ్యాస్ డబ్బులో కొంత మన బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది అంటూనే ఉన్నారు.  

కానీ అది ఎంత వరకు అందరికీ అందుతున్నది అనాన్ విషయంలో క్లారిటీ లేదు . మరో వైపు గ్యాస్ సిలిండర్ల లో గ్యాస్ ఎంత వరకు  నింపుతున్నారు అన్నది చాలా మంది ప్రశ్న. ఎందుకంటే చాలా మంది మహిళలు గ్యాస్ రావాల్సిన రోజులకన్నా ముందుగానే అయిపోతుంది గ్యాస్ పూర్తిగా నింపడం లేదన్న వార్తలను చాలానే చూశాం. ఇలాంటి నేపథ్యంలో  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వంట గ్యాస్ వినియోగారులకు పండగ చేసుకునే శుభవార్త చెప్పింది. తాజాగా తెలిపినటువంటి ఫైబర్ సిలిండర్ లను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రవేశ పెట్టింది ఈ సంస్థ.  ఫైబర్ సిలిండర్ లో గ్యాస్ అంటే అంటే ప్రమాదం అనుకునేరు. అస్సలు కానే కాదు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ తో తయారుచేయబడిన సిలిండర్లు. అంతే కాదు ఈ సిలిండర్ల లో గ్యాస్ లెవల్ ఇట్టే తెలుసుకోవచ్చు. సిలిండర్లో గ్యాస్ ఎంత వరకు నింపారన్నది పైన లేయర్ నుండే తెలుసుకునే వీలుంది. ఇది నిజంగా మహిళకు లడ్డు లాంటి వార్త. 

ఈ ఒక్క విషయం చాలు అందరినీ ఈ కొత్త సిలిండర్ల వైపుకు ఆకర్షించడానికి, ఇక మరో విషయం, విశేషం ఏంటంటే మన ప్రస్తుతం వాడుతున్న లోహ సిలిండర్ల కంటే 50% బరువు తక్కువగా ఉంటాయి. అంటే వీటిని హ్యాండిల్ చేయడం సులభం అలాగే సేఫ్టీ కూడా, ఎందుకంటే ఈ సిలిండర్లపై తుప్పు పట్టదు, మరకలు భయం లేదు అంతేకాదు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే  ఈ సిలిండర్లు మంటలు అంటుకోవట, ఇక ఇంతకన్నా శుభవార్త మరేముంటుంది. అందులోనూ  10 కేజీల ఫైబర్ గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ. 659.50 గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిలిండర్లు 5 మరియు 10 కేజీల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇది నిజంగా వంట గ్యాస్ ఉపయోగించే వారికి గొప్ప శుభవార్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: