ఆంధ్ర ప్రదేశ్  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా ? ఈ మేరకు వైసిపి మంత్రుల సమావేశంలో ఆయన లీకులు ఇచ్చారా ? అంటే వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రెండున్నర సంవత్సరాలలో జగన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటి అడియాస‌లు అవుతూ వస్తున్నాయి. కేవలం సంక్షేమం అన్న మాట తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.

ఏదేమైనా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. 2024 వరకు ఆగితే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ... అప్పటి వరకు కాకుండా కేసీఆర్ లా ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం లేకుండా మరోసారి ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన భావిస్తున్నారు. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళితే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ,మంత్రులకు ఆయన టిక్కెట్లు ఇవ్వ‌ర‌ని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాని మంత్రుల్లో పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల పేర్లు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అలాగే రాయ‌ల‌సీమ‌లో ఈ సారి ఇద్ద‌రు బీసీ మంత్రుల‌కు టిక్కెట్లే అవుట్ అంటున్నారు. ఇక గోదావ‌రి జిల్లాల నుంచి చెరుకువాడ రంగ‌నాథ రాజుకు ఇదే చివ‌రి అవ‌కాశం. ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు లేదంటున్నారు. అలాగే తూర్పు గోదావ‌రిలో కూడా ఓ మంత్రిని త‌ప్పించి మ‌రో యువ‌నేత‌ను అక్క‌డ రంగంలోకి దింపుతార‌ని తెలుస్తోంది.

ఇక వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా చాలా మందిని ఈ సారి జగన్ ప‌క్క‌న పెట్టేస్తార‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న వారితో పాటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించు కోని వారికి ఈ సారి ఛాన్సులు లేన‌ట్టే అని తెలుస్తోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: