రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న జోరుగా సాగుతోంది. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ముంద‌స్తు జ‌పం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది చివ‌రిలో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని.. మూడున్న‌రేళ్ల‌కే ఆయ‌న ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే ప్లాన్‌లో ఉన్నార‌ని.. తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ముంద‌స్తు క‌నుక వ‌స్తే.. రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో ఏపార్టీ దూకుడు చూపిస్తుంది? ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది?  లేదా.. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇక్క‌డ రిపీట్ అవుతాయా? అనేది ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న న‌గ‌రం విజ‌య‌వాడ‌.

ఇక్క‌డ ఒక‌ప్పుడు కాంగ్రెస్ దూకుడు చూపించేది. త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ ప్ర‌భావం రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో త‌గ్గిపోయి.. టీడీపీ పుంజుకుంది. ఈ క్ర‌మంలోనే 2014లో ఒక్క ప‌శ్చిమ నియోజ‌వ‌క‌ర్గం త‌ప్ప‌.. తూర్పు, సెంట్ర‌ల్‌, ఎంపీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. అయితే.. ప‌శ్చిమ నుంచి గెలుపుగుర్రం ఎక్కిన వైసీపీ నాయ‌కులు జ‌లీల్ ఖాన్‌.. పార్టీ మారి.. టీడీపీలోకి చేరిపోయారు. దీంతో న‌గ‌రం అంతా కూడా 2019 ఎన్నిక‌ల నాటికి టీడీపీ పుంజుకుంటుంద‌ని అనుకున్నారు. అయితే.. అనూన‌హ్యంగా 2019 ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి తిర‌గ‌బ‌డింది.

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ ద‌క్కించుకుంది. అంటే.. 2014తో పోల్చుకుంటే.. ఒక స్థానంలో వైసీపీ మెరుగుప‌డింది. మిగిలిన తూర్పు. విజ‌య‌వాడ ఎంపీ స్థానాలు మాత్రం టీడీపీకే ద‌క్కాయి. మ‌రి ఈ ప‌రిస్థితి ముంద‌స్తు ఎన్నిక‌ల్లోనూ రిపీట్ అవుతుందా?  టీడీపీ ఈ స్థానాల‌ను నిల‌బెట్టుకుంటుందా? అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్‌లో వైసీపీ విజ‌యం సాధిస్తుందా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. అయితే.. ఎన్న‌డూ లేనిది... తూర్పులో.. ఇప్పుడు.. టీడీపీకి ఎదురు గాలులు వీస్తున్నాయి. అదేస‌మ‌యంలో ప‌శ్చిమ‌లో వైసీపీ హ‌వా కొన‌సాగుతూనే ఉంది.

ఇక‌, ఒక్క సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. గ‌త ఏడాది పోగోట్టుకున్న స్థానంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డంతోపాటు.. ప్ర‌స్తుతం ఉన్న తూర్పును చేజార్చుకునే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు..కీల‌క‌మైన ఎంపీ స్థానం విష‌యంలోనూ.. త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది. స్థానిక నేత‌.. కేశినేని నానిపై సొంత పార్టీలోనే విరోదులు పెర‌గ‌డం, ఆయ‌న ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండ‌డం.. వివాదం కావ‌డం వంటి ప‌రిణామాలు.. టీడీపీని ఆందోళ‌న‌లోకి నెట్టాయి. దీంతో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. గెలిచే ప‌రిస్థితి లేద‌ని సొంత పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున స్థానికుల‌కు అవ‌కాశం ఇస్తే.. గెలిచే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ ఒక్క విష‌యం త‌ప్ప‌.. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విషంలో మాత్రం.. వైసీపీ పుంజుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: