జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాలవారీగా రాజకీయం పరిపాలన చేస్తున్నారు అన్న చర్చలు అయితే నడుస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాలను అణ‌గ‌దొక్క‌డంతో పాటు... కొన్ని సామాజిక వర్గాలనే ఆయన పైకి తీసుకు వస్తున్నారు అన్నచ‌ర్చ  చాలా మందిలో ఉంది . ముఖ్యంగా ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు గా ఉన్న తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గం నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు అన్న అభిప్రాయం ఉంది. అలాగే  కాపు వ‌ర్గం ప్రజలు ఎక్కువగా తమ కులానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపుతారు అన్న అభిప్రాయం కూడా ఉంది.

ఈ రెండు సామాజిక వర్గాలకు తాము ఎంత చేసినా వచ్చే ఎన్నికల్లో వీరు తమ కులాల‌కు చెందిన నేత‌లు, పార్టీల‌కే ఓట్లు వేస్తారు అన్నది జ‌గ‌న్‌ అభిప్రాయం. వీరు వైసీపీకి ఓటేస్తార‌న్న అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి లేదని చాలా మంది చెబుతుంటారు. అందుకే ప్రభుత్వ పదవుల్లోనూ ... పార్టీ పదవుల్లోనూ జగన్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు పెద్దగా ప్ర‌యార్టీ ఇవ్వడం లేదని ఆయా సామాజిక వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క కొడాలి నాని మాత్రమే క్యాబినెట్లో ఉన్నారు. ఇక కాపు సామాజికవర్గం నుంచి నలుగురు నేతలు క్యాబినెట్ లో ఉన్నా వారు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నారు తప్ప వారికి ఏ మాత్రం ప్రాధాన్య‌త‌ లేదు.

జ‌గ‌న్ కాపులు బ‌లంగా ఉన్న చోట్ల బీసీల‌కు ప్ర‌యార్టీ ఇస్తున్న ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా ఏపీ మొత్తం మీద చూస్తే రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌ల‌కు ఇచ్చిన ప‌దవులు కాపుల‌కు లేవు. ఇంకా చెప్పాలంటే ఏపీ జ‌నాభాలో.. అంటే ఓట‌ర్ల‌లో కాపు వ‌ర్గం ఓట‌ర్లు అంద‌రి కంటే ఎక్కువుగా ఏకంగా 28 శాతం వ‌ర‌కు ఉన్నారు. పార్టీ ప‌ద‌వులు, ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో వారికి అదే స్థాయిలో ప‌ద‌వులు రావాల్సి ఉన్నా అవి రావ‌డం లేదు. ముంద‌స్తు ఎన్నిక‌లు వస్తే ఈ సారి జ‌గ‌న్‌కు కాపులు ఝుల‌క్ ఇవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: