టిటిడి స్పూర్తితో..

తిరుమల తిరుపతి దేవస్థానం స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముందు వెళుతోంది. ఇది ముమ్మటి నిజం. టిటిడి అధికారులు ఇటీ వల ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహహిస్తామని ప్రకటించారు. దేవదేవునికి నిత్య నైవేద్యాలు కూడా ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆహార పదార్ధాలను సమర్పిస్తున్నారు. ఇటీవల  తిరుమల అన్నమయ్య భవన్లో  ప్రకృతి ఆహార పదార్దాలతో భోజన శాలను ఏర్పాటు చేసి, తదుపరి విరమంచుకుంది..  ఇలా ఎన్నో కార్యక్రమాలతో టిటిడి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతోంది.  ఇదే బాటలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పయనిస్తోంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా |అడుగులు వేగంగా వేస్తోంది.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకృతి వ్యవసాయం పై కీలక ప్రకటన చేశారు.
ఆర్.బికె ( రైతు భరోసా కేంద్రాలు)లో ఇక నుంచి సిహెచ్.సి ( నేచురల్ ఫార్మింగ్ కస్టమ్స్ హైరింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాలలో ప్రకృతి సేద్యానికి సంబంధించిన సమాచారం ఉంటుందని చెప్పారు. ఈ తరహా వ్యవసాయానికి అవసరమైన పురాతన వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. నాటి పరికరాలతో నేడు మెరుగైన విధంగా వ్యవసాయం ఎలా చేయాలన్న దానిపై అవసరమైన పక్షంలో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వ్యవసాయ మంత్రి ప్రకటించారు. ఎరువులు, పురుగు మందులను అతి తక్కువగా వాడాలని కన్నబాబు రైతులకు సూచించారు. ప్రతి రైతు భవిష్యత్తులో  ప్రకృతి వ్యవసాయదారుడు కావాలన్నదేముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఆ దిశగా తమ మంత్రిత్వ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. సి.ఎం. ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఐదు వేలకు పైగా సి.హెచ్.సిలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పంటల నాణ్యత ఎక్కువ
ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు సంవత్సరాలుగా పంటల నాణ్యత పెరిగిందని , ఇక్కడి ప్రభుత్వాలు అనుమతిస్తే తాము దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి సదాశివ మియాలాండరన్  తెలిపారు.  శ్రీలంక ప్రధాన మం్రతి  కార్యదర్శి సెంథిల్ తో  కలసి ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఇక్కడ నుంచి పసుపు, ధాన్యం, మిర్చి, పండ్లను తమ దేశం దిగుమతి  చేసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వాలు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తే ఇక్కడ నుంచి ఎగుమతులకు ఆస్కారం కలుగుతుందని, తాము కూడా దిగుమతులతో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందగలుగుతామని  అన్నారు. శ్రీలంక వ్యవసాయ శాఖ మం్రతి, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కన్నబాబుతో సమావేశమై తన ప్రతిపాదనలను వివరించారు. స్పందించిన రాష్ట్ర మంత్రి అన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని  చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: