ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో అనేక నిర్ణయాలు దూకుడుతో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా తో పోరాటంలో మాత్రం కాస్త వెనక పడాల్సి వచ్చింది. దానికి కూడా కారణాలు తెలిసినవే. ఎవరి స్వాతంత్రం వారిది అనే నిర్లక్ష్యంతో కనీస జాగర్తలు పాటించకపోవడం అక్కడ ఇప్పటికీ కేసులు విపరీతంగా ఉండటానికి కారణంగా చెపుతున్నారు. కానీ, అక్కడ మాత్రం ఆ విషయం పెద్దగా ఎవరు చెవిన పెట్టుకోవడం లేదు.  కరోనా కు ముందు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కరోనా తెరపైకి వచ్చిందా అనేది ఇంకా తేలని  ప్రశ్న.

ఏది ఏమైనా కరోనా వచ్చింది లేదా తెచ్చింది మాత్రం చైనా వలననే అనేది అమెరికా వాదన. మాకు ఏమీ తెలియదు అనేది చైనా వాదన. ప్రపంచ ఆర్యోగ సంస్థ కూడా చైనా వెళ్ళి ఏమి తేల్చలేకపోయింది. దీనితో ట్రంప్ కాస్త అసహనానికి గురయ్యాడనేది అందరికి తెలిసిన విషయమే. కానీ, తెర వెనుక మాత్రం ట్రంప్ కాస్త దూకుడుగా నిర్ణయం తీసేసుకున్నట్టు తెలుస్తుంది. అదేమిటంటే, తన సైన్యంలో ప్రధాన అధికారులను చైనాపై అణుదాడికి సిద్ధం కావాలని ఆదేశించాడట. కాకపోతే ఆయా అధికారులు ఈ సంఘటనకు ఆశ్చర్యం వక్తం చేసి, ట్రంప్ ఆదేశాలు పాటించరాదని రక్షణ అధికారులకు తెలిపారు. అదే తరహాలో చైనాకు కూడా తమపై అమెరికా దాడి చేయబోవడం లేదని తెలిపారట.  

ఇలా ఎందుకు జరిగిందంటే, అప్పటికే అమెరికాలో ఎన్నికలకు సిద్ధం అయ్యాడు ట్రంప్. ఆయన గెలుస్తారో లేదో తెలియదు కాబట్టి ఆయన ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదని ఆ రక్షణ అధికారి చెప్పడం విశేషం. ఇక్కడ ట్రంప్ కరెక్టా లేక ఆ అధికారి కరెక్టా అనేదాని కంటే అణు దాడి జరగలేదు అనేది ముఖ్యం. ఏది ఏమైనా శత్రువుపై కోపం రాగానే చేతిలో ఉన్న భీకర ఆయుధాన్ని దానిపై విడిచిపెట్టడం సమంజసం కాదు. ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. చేతిలో ఆయుధాలు ఉన్నాయని ఇష్టానికి వాడకుండా, శాంతియుతంగా ఉండటమే ముఖ్యం. ఇక్కడ దాడి జరిగి ఉంటె, ఒకరిని చూసి ఇంకొకరు దాడికి దిగితే అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. దీనిని ఆయా దేశాలు గమనించి, పేరుకు పెద్దగా కాకుండా నిజంగా పెద్ద అనేది బాధ్యతగా ఉండటంలో నిరూపించుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: