సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో నాడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఒక రేంజ్ లో హవా చెలాయించేది. తెలుగుదేశం పార్టీ పుట్టేవరకూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పీవీ నరసింహారావు - ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య మినహా మిగిలిన ముఖ్య మంత్రులు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల డామినేష‌న్‌ ఎక్కువగా ఉండేది. తెలుగుదేశం పార్టీలో మాత్రం ముఖ్యమంత్రులుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. వారిద్ద‌రే ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు.

తర్వాత 2004లో తిరిగి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కొద్ది నెలలపాటు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. తిరిగి కాంగ్రెస్ అధిష్టానం రెడ్డి వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆయన సమైక్యాంధ్రకు చివ‌రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి కుమారుడు పెట్టిన వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంది. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నా... నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు కూడా వారికి ప్రయారిటీ ఇవ్వడంతో సీమ జిల్లాల్లో రెడ్డి వర్గంలో 30 శాతం మంది టిడిపి వైపు ఉండేవారు.

అయితే గత ఎన్నికల్లో రెడ్డి వర్గం అంతా కట్టకట్టుకుని వైసీపీకి ఓట్లేసింది. రెడ్డి వర్గం నుంచి టీడీపీ తరఫున ఒక ఎమ్మెల్యే కూడా విజయం సాధించలేదు. రెడ్డి వర్గం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రెడ్డి వర్గం నేతలతోపాటు రెడ్డి వర్గం ప్రజలు సైతం తాము ఎన్నో ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశామని... అయితే తమకు జగన్మోహన్ రెడ్డి చేస్తోంది ఏమీ లేదని వారు వాపోతున్నారు. రెడ్డి వర్గం లో నేతలు ఎక్కువమంది ఉండడంతో వారిని సంతృప్తి పరచడం జగన్ వల్ల కావడం లేదు. రాయలసీమలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. గత ఎన్నికల్లో జగన్‌కు వన్ సైడ్ గా ఓట్లేసిన ఉపయోగం లేద‌ని వారు ఆగ్ర‌హంతో ఉన్నారు. అందుకే ఈ సారి ఈ వర్గంలో కొంత మందిలో మార్పు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: