రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కులు అచ్చెన్నాయుడు. అయ్య‌న్న‌పాత్రుడు కూడా! ఉత్త‌రాంధ్ర టీడీపీ పెద్ద దిక్కుగా భావించే వీరిద్ద‌రూ గ‌తంలో మంత్రి ప‌దవులు అనుభ‌వించిన వారే. అధినేత బాబుకు ద‌గ్గ‌ర‌వారే! కాల క్ర‌మంలో అచ్చెన్న రాష్ట్ర అధ్య‌క్షులు అయ్యారు. అయ్య‌న్న న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓడిపో యారు. అచ్చెన్న మాత్రం టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచారు. ఇంత‌టి వైసీపీ హ‌వాలోనూ గెలిచారు. ఆయ‌న గెల‌వ‌డంతో వైసీపీ మ‌రింత కక్ష్య సాధింపు రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ త‌రుణాన అచ్చెన్న కూడా ఓ సంద‌ర్భంలో చాలా దూకుడుతో వ్య‌వ‌హ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను క‌ట్ట‌డి చేయాల‌న్న ఉద్దేశంలో భాగంగా సీఎం జ‌గ‌న్  ఓ ప్లాన్ వేశారు. ఈఎస్ ఐ మందుల కొనుగోళ్ల‌లో డ‌బ్బులు గోల్ మాల్ అయ్యాయ‌ని పేర్కొంటూ ఆయ‌న‌ను అరెస్టు చేయించారు. ఈ ద‌శ‌లో ఆయ‌న అనేక ఆటుపోట్లు చ‌వి చూశారు.


ఆఖ‌రికి  బెయిల్ రావ‌డంతో కాస్త స్థిమిత ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న గురించి జిల్లాలో ఎక్కువ‌గా ప‌నిచేసింది ఎంపీ రామూనే. బెయిల్ విష‌య‌మే కాదు మిగ‌తా పార్టీ విష‌యాల‌ను చ‌క్క‌దిద్దింది ఎంపీ రామూనే. స‌హ‌జంగా సున్నిత మ‌న‌స్త‌త్వం ఉన్న రాముపై వైసీపీ పెద్ద‌గా ఆరోప‌ణ‌లు చేయ‌దు కానీ అచ్చెన్న అంటేనే మండిప‌డుతుంది. ఈ ద‌శ‌లో అచ్చెన్న చాలా వెన‌క్కు త‌గ్గారు. ఎందుకొచ్చిన గొడ‌వ అన్న విధంగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌నా శైలి కూడా ఉంటోంది. క్యాడ‌ర్ ను కూడా వెన‌క్కు త‌గ్గ‌మనే చెప్పారు. అచ్చెన్న త‌గ్గినా జ‌గ‌న్ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. అచ్చెన్న‌ను అదే ప‌నిగా కార్న‌ర్ చేసే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి దువ్వాడ శ్రీ‌ను (మొన్న‌టి  ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం ఎంపీగా వైసీపీ త‌ర‌ఫున పోటీచేసి ఓడిపోయారు) ను రంగంలోకి దింపి, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి శ్రీ‌ను తన దూకుడు పెంచారు. టీడీపీ క్యాడ‌ర్ ను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్య‌మంత్రి అండ త‌న‌కుంద‌న్న ధీమాలో భాగంగా అచ్చెన్న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న త‌న సొంత క్యాడ‌ర్ ను దూరం చేసుకున్నారు.



 

రోజు రోజుకూ ఫిర్యాదులు పెర‌గ‌డంతో పార్టీ అధిష్టానం కూడా రేప‌టి వేళ ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలో చోటిచ్చేందుకు ముఖం చాటే స్తోంది అని స‌మాచారం. ఇప్పుడు అచ్చెన్న ప్లేస్ లో అయ్య‌న్న వ‌చ్చారు. నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడుతున్నారు. అస‌లు తానొక సీనియ‌ర్ పొలిటీషియ‌న్ అన్న మాట‌నే మ‌రిచిపోయి రాజ‌కీయ ప్ర‌సంగాలు చేస్తున్నారు. ఇక అయ్య‌న్న అరెస్టు ఖాయ మ‌ని తెలుస్తోంది. అచ్చెన్న లానే  అయ్య‌న్న కూడా త్వ‌ర‌లో కొన్ని ఇబ్బందుల‌కు గురికాక త‌ప్ప‌దు. ఇప్పుడు అయ్య‌న్న‌పై మా ట్లాడేందుకు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌ని రంగంలోకి దింపారు జ‌గ‌న్. ఆయ‌న‌తో పాటు మ‌రో వీరి విధేయుడు జోగి ర‌మేశ్ కూడా ఉన్నారు. వీరి ద్ద‌రితో పాటు రోజా కూడా తోడ‌య్యారు. ఇంత మంది మాట్లాడుతున్నా అయ్య‌న్న త‌న స‌హ‌జ సిద్ధ ధోర‌ణిలోనే వెళ్తున్నారు త ప్ప ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap